
ఏఎన్‌యూలో ఒకే సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం
నాడు అందరికీ సమ ప్రాధాన్యం
పెదకాకాని (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి పాలన, కార్యనిర్వహణ పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేవారు. జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు పెద్దపీట వేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ సామాజిక వర్గానికే అన్ని పదవులు కట్టబెడుతున్నారు. ఇన్‌ఛార్జ్ వీసీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెల్ కోఆర్డినేటర్, రీసెర్చ్ సెల్ కోఆర్డినేటర్, పీజీ పరీక్షల కోఆర్డినేటర్, పరీక్షల సీటీఏ వంటి ఏడు కీలక పదవులు చంద్రబాబు సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఓట్లు, జనాభా పరంగా అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఆ సామాజిక వర్గానికి పదిహేను పదవుల్లో ఏడు కీలక పదవులు ఇవ్వడంపై విమర్శలు వెల్లవెత్తాయి. గత ఏడాదిన్నర కాలంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నా తాజాగా ఖాళీ అయిన రెక్టార్ పోస్టులోనూ అదే సామాజిక వర్గానికి చెందిన ఓ అధ్యాపకుడిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అందరూ విస్తుపోయారు. వర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఇలా కీలకమైన రెండు పదవులూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం ఎప్పుడూ జరగలేదని విద్యావేత్తలు చెబుతున్నారు.
కూటమిలో గెలుపులో తాము చాలా కీలకం అని చెప్పే కాపులు, ఎస్సీల్లోని ఓ వర్గం, గుంటూరు జిల్లా ఓట్ల పరంగా పెద్ద ప్రభావం చూపే బీసీల్లో ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గాలకు ఏఎన్‌యూ పదవుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. చినబాబు నియోజకవర్గంలో ఉన్న వర్సిటీలో ఆయా వర్గాలపై చిన్నచూపు చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెందిన కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేని పరీక్షల కోఆర్డినేటర్ పదవి ఒకటి ఇచ్చి పక్కన పెట్టారు. టీడీపీకి వెన్నుదున్నుగా నిలిచామని చెప్పుకుంటున్న ఎస్సీల్లోని ఒక సామాజిక వర్గానికి అస్సలు పదవే దక్కలేదు. టీడీపీకి మద్దతుగా నిలిచే యాదవ, గౌడ వంటి ప్రధాన బీసీ వర్గాలకు పూర్తిగా మొండిచేయి చూపారు. ఎస్టీలతోపాటు పలు ఇతర వర్గాలకు పదవుల ఊసేలేదు.
సగానికిపైగా కీలక పదవుల్లో
ఒక సామాజిక వర్గం వారే
చినబాబు ఇలాకాలో
ఇతర వర్గాలకు మొండిచేయి
కాపులు, ఎస్సీల్లోని ఓ వర్గం, బీసీల్లోని
కీలక వర్గాలకు దక్కని ప్రాతినిధ్యం
వైఎస్సార్‌సీపీ హయాంలో
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట
ఎన్ని విమర్శలు వచ్చినా
తీరు మారని చంద్రబాబు సర్కారు
తాజాగా రెక్టార్ నియామకంలోనూ
అదే పక్షపాతం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలకు పెద్దపీట వేశారు. వీసీ, రెక్టార్, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్, ఐఎస్‌సీ డైరెక్టర్‌తోపాటు పలు కీలక పదవులను ఈ వార్గల వారికి ఇచ్చారు. నేటి కూటమి ప్రభుత్వంలో దానికి భిన్నంగా వర్సిటీలో ఉన్న పదవుల్లో సగానికిపైగా, కార్యనిర్వహణలో కీలక స్థానాలన్నింటిలో ఒక సామాజిక వర్గం వారికే కట్టబెట్టడం చంద్రబాబు ప్రభుత్వ అంతరంగాన్ని తెలియజేస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పదవులు, పెత్తనం అన్నింటిలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు వర్సిటీలోని పాలన, కార్యనిర్వహణ పదవుల్లో కీలమైన వాటిని ఎక్కువగా తమ వర్గానికే యథేచ్ఛగా కట్టబెడుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ వారి ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా కూటమి పాలకులు వ్యవహరిస్తున్నారు.

ఏఎన్‌యూలో ఒకే సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం