
వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ ఎంపికలు
పెదకాకాని(ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో వెస్ట్‌జోన్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికలు నిర్వహించినట్లు ఆ విభాగం కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ వి.దివ్యతేజోమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గంగాధర్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జాతీయ సేవా పథకంలో ఉన్నటువంటి వలంటీర్లు సేవాభావంతో పాటుగా దేశభక్తి, ఆపదలో సాటి మనిషికి సహాయం చేసే తత్వాన్ని కలిగిఉండాలన్నారు. రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి ప్రొఫెసర్ మద్దినేని సుధాకర్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకంలో ప్రవేశించిన వలంటీర్లకు ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నాయని, సేవాభావాలతో పాటుగా నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. రీజనల్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ సేవాపథకం వలంటీర్లు సమయ పాలన, క్రమశిక్షణ, భవిష్యత్తు ప్రణాళికలు వంటి లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు.