
శతాధిక వృద్ధురాలి మృతి
దాచేపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మందపాటి రమేష్‌రెడ్డి తల్లి అప్పమ్మ(103) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో అప్పమ్మ పాల్గొన్నారు. ఆమైపె నిర్బంధం ఉండడంతో రెండేళ్లపాటు అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపారు. అప్పమ్మ భర్త అప్పిరెడ్డి నడికుడి మేజర్ పంచాయతీ సర్పంచిగా పదేళ్లపాటు పనిచేశారు. అప్పమ్మకి ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.