
బలరాముడి బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు
నగరంపాలెం: అయోధ్యలో ప్రతిష్టించేందుకు తరలివెళ్తున్న బాలరాముడు, కోదండం, రామబాణం, బంగారు పాదుకలకు మంగళవారం బృందావన్‌గార్డెన్‌న్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14 కిలోల వెండి, కిలో బంగారంతో చల్లా శ్రీనివాస శాస్త్రి తయారు చేయించగా, భక్తుల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు. అయోధ్యలో ప్రతిష్ఠకు బయలుదేరుతున్న క్రమంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోని భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడం, పలువురు పీఠాధిపతులచే పూజలను నిర్వహి స్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహాకులు బొల్లేపల్లి సత్యనారాయణ బృందం పాల్గొన్నారు.