నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం | - | Sakshi
Sakshi News home page

నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం

Aug 9 2025 4:58 AM | Updated on Aug 9 2025 4:58 AM

నెమలి

నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం

పెదకాకాని: భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని నెమలి పింఛాలతో అలంకరించారు. పెదకాకాని శివాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డీసీ గోగినేని లీలాకుమార్‌ ఏర్పాట్లు చేశారు.

మహంకాళీ ఆలయంలో

వరలక్ష్మీ వ్రతం

దుగ్గిరాల: కంఠంరాజు కొండూరు గ్రామంలోని మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతంతోపాటు విశేష పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సామూహికంగా వ్రతాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన దంపతులు వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈవో కె.సునీల్‌ కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ముగిసిన భూ వరాహస్వామి జయంతి వేడుకలు

తాడేపల్లిరూరల్‌: సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న భూ వరాహస్వామి జయంతి వేడుకలు శుక్ర వారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి మంగళశాసనాలతో భూ వరాహస్వామి వారికి పంచామృతాలతో విశేష అభిషేకం, అర్చన నిర్వహించామన్నారు. హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని హయగ్రీవ హోమం, పూర్ణాహుతి, స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, ఆశీర్వచనంతో కార్యక్రమాలు వైభవంగా జరిగాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భూ వరాహస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పురాణం వెంకటాచార్యులు, శకుంతల దంపతులు పద్మావతి అమ్మవారికి వివిధ రకాల స్వీట్లు, వస్త్రాలు పండ్లతో సారెను అందజేశారు.

పశ్చిమ డెల్టాకు 7,713 క్యూసెక్కులు విడుదల

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శుక్రవారం 7,713 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కు 300, బ్యాంక్‌ కెనాల్‌కు 1,861, తూర్పు కాలువకు 702, పశ్చిమ కాలువకు 277, నిజాంపట్నం కాలువకు 449, కొమ్మూరు కాలువకు 3,180 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజి నుంచి 18,125 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు.

నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం 1
1/3

నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం

నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం 2
2/3

నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం

నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం 3
3/3

నెమలి పింఛాలతో భ్రమరాంబకు అలంకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement