
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన
నగరంపాలెం: ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం దృష్ట్యా నగరంపాలెం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. వేడుకల సందర్భంగా పోలీస్ బలగాలు నిర్వహించే కవాతు, ప్రముఖులు, ఔత్సాహికుల గ్యాలరీలు, ఆయా ప్రభుత్వ శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటయ్యే ప్రదేశాలను నిశితంగా పరిశీలించారు. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు అరవింద్ (పశ్చిమ సబ్ డివిజన్), ఏడుకొండలరెడ్డి (ఏఆర్), ఎస్‌బీ సీఐ అలహరి శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.