
ఇంటింటికీ వస్తే నిలదీయండి !
నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ లేనిపోని మాటలు చెప్పి ఇంటింటికీ తిరిగి అబద్ధపు హామీలిచ్చి ఓట్లేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు సుపరిపాలన తొలి ఏడాది పేరుతో వస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను నిలదీసి ఎగ్గొట్టిన పథకాలను ఎందుకివ్వలేదో ప్రజలు నిలదీయాలన్నారు. ఎన్ని అవాంతరాలు ఉన్నా సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసి మరీ ప్రజలకు నేరుగా ఖాతాల్లోకి అందించిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయితే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు.