
హత్యాయత్నంలో ఎమ్మెల్యేపై అనుమానాలు
నగరంపాలెం: పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత బొనిగల నాగ మల్లేశ్వరరావుపై పాశవికంగా జరిగిన హత్యాయత్నంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాత్రపై అనుమానం ఉందని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆరోపించారు. నాగ మల్లేశ్వరరావు కేసు పూర్వపరాలను ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ దృష్టికి మోదుగులతోపాటు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బాధితుని సోదరుడు అమరేంద్ర, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఈ హత్యాయత్నం జరిగి నాలుగు రోజులైనా పోలీసుల దర్యాప్తు నత్తనడకగా సాగుతోందని ఆరోపించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గుర్ని అరెస్ట్ చేశారని, పాత్రధారుల కంటే సూత్రధారులు ముఖ్యమని అన్నారు. జంట హత్య కేసుల్లో సీసీ టీవీ ఫుటేజీలో పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ఉన్నారా? పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆ రూల్‌ను ఇక్కడ స్థానిక శాసనసభ్యునికి వర్తింపజేయరా అని అన్నారు. రైతులను పరామర్శించేందుకు మిర్చియార్డుకు వెళ్తే మాజీ సీఎం వైఎస్ జగన్, ఇతర నేతలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రెడ్‌బుక్ ప్రకారమే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ సీటులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ స్థానంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూర్చుంటే సరిపోతుందని మండిపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర సూచనల్లేకుండా బాబురావు కుటుంబం ఈ హత్యాయత్నం చేయదని ఆరోపించారు. హత్యాయత్నం బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసుల నమోదులో పోలీసుల దూకుడు కూటమి నేతలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం దాడి సూత్రధారి అయిన ఎమ్మెల్యే ధూళిపాళ్లపై కేసు నమోదు చేయాలి గుంటూరు జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఎమ్మెల్యే పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే వరకు ఎంతవరకై నా పోరాడతామని స్పష్టీకరణ

హత్యాయత్నంలో ఎమ్మెల్యేపై అనుమానాలు