వైఎస్సార్ సీపీలో పదవులు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సైదా ఖాన్‌ను పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
● గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సురసాని వెంకటరెడ్డిని పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.


