
విద్యుత్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేయాలి
తెనాలి టౌన్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్‌ను ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాజేష్ కోరారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్‌ను యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు కండీషన్లు, పదోన్నతులపై చర్చించినట్లు రాజేష్ తెలిపారు. అలవెన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు సంబంధించిన ఆర్డర్‌ను కూడా త్వరలో ఇస్తామని డైరెక్టర్ చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు బీటీ కృష్ణ తదితరులు ఉన్నారు.