
జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక
చీరాల రూరల్: బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎంఏ హైస్కూలు క్రీడా మైదానంలో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాలలో జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేశారు. ప్రతిభభ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయకుమార్, కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, సమ్మర్ క్యాంప్ ఇన్చార్జి బి.ప్రేమయ్య, కోచ్ ప్రసన్నకుమార్ తెలిపారు. బాలురకు సంబంధించి అండర్–13, అండర్–15లలో 22 మంది చొప్పున ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. సీనియర్ క్రీడాకారుడు ఎన్. నరేష్, రమ్మికుమార్, ఎన్.బాలశౌరి, క్రీడాకారులు పాల్గొన్నారు.