
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
ఫిరంగిపురం: ప్రమాదవశాత్తూ ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఆటోడ్రైవర్ మృతిచెందగా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ వెళుతూ ఫిరంగిపురం గ్రామశివారులోని గోకుల్ టీసెంటర్ సమీపంలో గుంటూరు నుండి నరసరావుపేట వెళుతున్న ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోడ్రైవర్ జి.మనోజ్‌కుమార్ (25) అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు ప్రయాణిలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు చికిత్స కోసం తరలించారు. సంఘటనా స్థలం నుంచి రహదారి కిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ రవీంద్రబాబు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నలుగురికి తీవ్రగాయాలు
నిలిచిన వాహనాలు