గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం సోమవారం జరిగింది. అభ్యర్థులు తమ మేనిఫెస్టోను న్యాయవాదుల ముందు ఉంచారు. అధ్యక్ష పదవికి యగలశెట్టి శివ సూర్యనారాయణ, కాజా భరద్వాజ, నంబూరు పాములు, మధిర నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. వీరు బార్ అసోసియేషన్‌ను ప్రగతి పథంలో నడిపిస్తామని ఎలక్షన్ ఆఫీసర్ కాసు వెంకటరెడ్డి, న్యాయవాదుల సమక్షంలో ప్రమాణాలు చేశారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి మాలే దేవరాజు, డాక్టర్ చింతా రామ కోటిరెడ్డి, జనరల్ సెక్రెటరీ పదవికి ఎరస్రాని అజయ్ కుమార్, మొగల్ కాలేషా బేక్, మోతుకూరి శ్రీనివాసరావు. జాయింట్ సెక్రటరీ పదవికి పొమ్మినేని చంద్రశేఖర్, ఇల్లూరి విజయ్ వర్మ, గూడూరి అశోక్ కుమార్, జీవీఎస్‌ఆర్‌కేఎస్ చంద్రన్, లైబ్రరీ కార్యదర్శి పదవికి మువ్వా పాపిరెడ్డి, బొప్పా శ్రీనివాసరావు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కొప్పాల హనుమంతరావు, గండికోట శేషగిరిరావు పోటీలో ఉన్నారు. లేడీ రిప్రజెంటివ్ పదవికి అడపా ఇందిరా, పూర్ణం కళ్యాణి, లేడీ ఎగ్జిక్యూటివ్ పదవికి కండెపు కవిత, మంద విజయ్ కుమారి పోటీలో ఉన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ పదవికి మోర్ల బాల సుందరి, మహమ్మద్ దాదా ఖరీం, బండ్లకృష్ణ, పల్లె నరసింహారావు, పి.సురేష్ కుమార్ పోటీలో ఉన్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పదవికి లింగాల మారుతి, శివ నాగ ప్రసాద్, షేక్ రిహాన్ బేగం, పెరుమాళ్ళ శివ రంగనాయకులు, రాయపూడి శ్రీనివాసరావు (గుండు శీను) పోటీలో ఉన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్‌లో సుమారు 3వేల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 2012 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.