● కదంతొక్కిన విద్యార్థులు, యువకులు ● తరలివచ్చిన వేలాది మంది ● హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక ● ఆమరణ నిరాహార దీక్షలకూ సిద్ధమని ప్రతిన ● భారీ ప్రదర్శనతో కూటమి నేతల వెన్నులో వణుకు
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నగరంపాలెం: వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు బుధవారం గుంటూరు నగరంలో చేపట్టిన ‘యువత పోరు’కు యువత, విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. తొలుత స్వామి థియేటర్ సెంటర్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, గుంటూరు, పల్నాడు పార్లమెంటరీ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), బాలవజ్రబాబు(తాడికొండ), దొంతి రెడ్డి వేమారెడ్డి(మంగళగిరి), బలసాని కిరణ్‌కుమార్ (ప్రత్తిపాడు) స్టూడెంట్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తరలివచ్చిన యువతతో కలిసి జూట్‌మిల్, కంకరగుంట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
అడుగడుగునా అడ్డంకులు
యువత పోరు ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ర్యాలీ ప్రారంభంలో ద్విచక్రవాహనాల తాళాలు లాక్కుని పట్టాభిపురం సీఐ వీరేంద్ర హడావుడి చేశారు. కలెక్టరేట్ మీదుగా ర్యాలీలో కలిసేందుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు నూనె ఊమామహేశ్వరరెడ్డి వెళ్తుండగా కంకరగుట్ట ఫ్లైఓవర్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ యువకులపై దాడి చేశారు. దీంతో తోపులాట జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ టోపీ పడిపోయింది. దీన్ని కానిస్టేబుల్‌పై దాడి అంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారానికి పూనుకుంది. మరోవైపు కలెక్టరేట్‌కు సమీపంలో రెండంచెల్లో బారికేడ్లు పెట్టి ర్యాలీని కలెక్టరేట్ వరకూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, యువతకు మధ్య తోపులాట జరిగింది. యువత బారికేడ్లను దాటుకుని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినదించారు. అనంతరం డీఆర్వోకు వైఎస్సార్ సీపీ నేతలు వినతిపత్రం అందించారు.
స్పందించకుంటే ఉద్యమం ఉద్ధృతం
అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా ఏ ఒక్క హామీనీ చంద్రబాబు అమలుచేయలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు కలిపి సుమారు రూ.4,600 కోట్లు పెండింగ్ ఉన్నాయని అంబటి వివరించారు. బకాయిలు ఇవ్వకపోగా కేవలం రూ.2 వేల కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నట్టు బడ్జెట్‌లో చూపించారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ద్వారా రూ.3 వేలు ఇస్తానని, ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన బాబు వాటి ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని అంబటి గుర్తుచేశారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలను వైఎస్ జగన్ మంజూరు చేయగా, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తోందని అంబటి మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కేసులకు భయపడం
సూర్యుడు భగభగలకు దీటుగా యువతరం నిప్పులుచెరిగింది. పదంపద