15న వెంకటపాలెం టీటీడీలో శ్రీనివాస కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

15న వెంకటపాలెం టీటీడీలో శ్రీనివాస కల్యాణోత్సవం

Mar 8 2025 2:28 AM | Updated on Mar 8 2025 2:24 AM

వెంకటపాలెం(తాడికొండ): లోక కల్యాణార్థం శ్రీనివాస కల్యాణోత్సవం ఈ నెల 15న గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు తెలిపారు. శుక్రవారం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఆర్డీయే కమిషనర్‌ కన్నబాబు, కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ వినయ్‌ చంద్‌, ఎస్పీ సతీష్‌ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ ఎ.భార్గవ తేజతో కలిసి శ్యామలరావు ఏర్పాట్లు పరిశీలించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేసేలా లోక కల్యాణార్థం స్వామివారి కల్యాణత్సోవాలను అనేక ప్రాంతాల్లో టీటీడీ నిర్వహిస్తోందన్నారు. ఇక్కడ శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని విజ్ఞప్తులు రావటంతో ఈనెల 15న జరిపేందుకు ముహూర్తం నిర్ణయించామన్నారు. కల్యాణోత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని, కల్యాణాన్ని తిలకించేందకు 20 వేల మది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని వివరించారు. 15న సాయంత్రం కల్యాణం జరుగుతందని వివరించారు. అనంతరం పోస్టర్‌ విడుదల చేశారు.

వివరాలు వెల్లడించిన టీటీడీ

ఈవో శ్యామలరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement