దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని పసుపు యార్డులో శుక్రవారం 758 బస్తాలు అమ్మకాలు జరిగాయి. సరుకు, కాయలు కనిష్ట ధర రూ.10,000, గరిష్ట ధర రూ.11,000 పలికాయి.
ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం
అప్రమత్తంగా ఉండాలి
నరసరావుపేట: ఆర్టీసీ డ్రైవర్లు నిరంతర అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శివనాగేశ్వరరావు పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆర్టీసీ జిల్లా రవాణా అధికారి ఎన్‌వీ శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం గ్యారేజ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో శివనాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహ కల్పించారు. మరో అతిథి సింధూస్కూలు అధినేత రామకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్ల వల్లే ఆర్టీసీకి మంచి పేరు వచ్చిందని వివరించారు. విధి నిర్వహణ సమయంలో గుండెపోటు వస్తే వేసుకోవాల్సిన మందులను సింధు విద్యా సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవ్వయ మాట్లాడుతూ సీపీఆర్ చేసే విధానాన్ని డ్రైవర్లకు వివరించారు. ట్రాఫిక్ సీఐ లోకనాధం మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. అనంతరం 36 ఏళ్లపాటు పనిచేసిన చిలకలూరిపేట డిపో డ్రైవర్ రాఘవరావుతోపాటు మరో 19మంది ఉత్తమ డ్రైవర్లను సన్మానించారు. సర్టిఫికెట్లు, పారితోషికాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సూపరిండెంట్ ప్రసాదు, డ్రైవర్లు, గ్యారేజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం
తాడికొండ: తాడికొండ మండలం బేజాత్‌పురంలోని పంట పొలాల్లో శుక్రవారం గుర్తు తెలియని 70 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది.ఎరుపు రంగు లంగా, లేత బ్లూ రంగు జాకెట్టు, లేత పచ్చరంగు చీర, తల వెంట్రుకలు తెలుపుగా ఉండి చామన చాయ రంగులో ఉంది. ఆచూకీ తెలిసిన వారు తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ తెలిపారు. స్థానిక వీఆర్‌ఓ రవి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.
ఇరువర్గాల ఘర్షణపై కేసు
తాడికొండ: బైక్ వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఘటనపై ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ కె.వాసు తెలిపిన వివరాలు.. పొన్నెకల్లులో అద్దెంకమ్మ తల్లి ఆలయం సమీపంలో నివసిస్తున్న మొగిలి రాము ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో అదే కాలనీకి చెందిన ఆవుల మంద వెంకటేష్ బైక్‌ను ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా యువకులిద్దరికీ తలపై గాయమైంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రోడ్డుభద్రతా మాసోత్సవాల ముగింపు 20 మంది ఉత్తమ డ్రైవర్లకు సన్మానం
పసుపు ధరలు