మధురానగర్(విజయవాడసెంట్రల్): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈనెల 22న బుధవారం ఎంఎస్‌ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఽధ్వర్యాన మెగా లోన్ మేళా నిర్వహించనున్నట్లు చాబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ దాసరి దేవరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు మద్దతుగా తాము మెగా లోన్ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో పాల్గొనే వారికి ఉచిత ప్రవేశ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుందని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈనెల 22న సోమవారం ఉదయం 10 గంటలకు నోరీ హాస్పిటల్ సమీపంలోని ఎంఎస్‌ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగే మెగాలోన్ మేళాకు హాజరు కావాలని కోరారు. మెగాలోన్ మేళాలో పాల్గొనేందుకు ఎంఎస్‌ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో స్వయంగా గానీ 79959 15450, 89197 37517 నంబర్లలోగానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.
ఈదురుగాలుల బీభత్సం
నకరికల్లు: మండలంలో సోమవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులు వీయడంతోపాటు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగి స్తంభాలు విరిగిపడ్డాయి. పలుగ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.