
అవార్డులు అందుకున్న విద్యార్థులతో చలపతి విద్యా సంస్థల చైర్మన్ ఆంజనేయులు తదితరులు
విద్యార్థులకు రూ.10 లక్షల ప్రైజ్ మనీ అందజేత
తాడికొండ: మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ఐఐటీ, జేఈఈ/ నీట్ స్కాలర్‌షిప్ టెస్ట్‌ను నిర్వహించారు. 3000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ విజేతకు రూ.1 లక్ష, ద్వితీయ విజేతకు రూ.75వేలు, తృతీయ విజేతకు రూ.50వేలు అందించారు. 4–10 ర్యాంక్‌ల విజేతలకు రూ.20 వేలు, 11–25 ర్యాంక్ సాధించిన విజేతలకు రూ.15 వేలు, 26–50 ర్యాంక్ విజేతలకు రూ.10 వేలు, 50–100 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు రూ.5 వేలు చొప్పున ప్రైజ్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా చలపతి విద్యా సంస్థల చైర్మన్ వై.వి.ఆంజనేయులు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వై. సుజిత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ధ్యేయగా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. స్కాలర్‌షిప్ టెస్ట్‌కు ఎక్కువ మంది జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు హాజరు కావడం మంచి పరిణామమని తెలిపారు. స్కాలర్‌షిప్ టెస్ట్‌కు హాజరైన విద్యార్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు కళాశాల తరఫున ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె. నాగ కిరణ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.