కోఠి కాలేజ్‌ భవితవ్యం ఏమిటి?

What is the Future of Koti Womens University in Hyderabad - Sakshi

హైదరాబాద్‌లోని ‘కోఠి మహిళా కళాశాల’ను ప్రభుత్వం ‘యూనివర్సిటీ’గా ప్రకటించింది. దీన్ని అందరం ఆహ్వానించాల్సిందే, కానీ ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన విధానపరమైన ప్రకటన రాకపోవడం విచారకరం. నూతనంగా ఏర్పాటయ్యే ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’లో పెట్టే కోర్సులు, ఆర్థిక వనరులు, టీచింగ్, నాన్‌–టీచింగ్‌ పోస్టుల పూర్తిస్థాయి భర్తీ ప్రక్రియ, యూని వర్సిటీ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాలు అస్పష్టం గానే ఉండిపోయాయి. 

యూనివర్సిటీ నిర్వహణకు కనీసం రెండు వందల ఎకరాల సువిశాలమైన భూమి ఉండాలి. ఇప్పటివరకు ఉన్న మహిళా కళాశాలను యూనివర్సిటీగా కొంతకాలం నిర్వహించి, తర్వాత వరంగల్‌లో కానీ, విజయవాడ రహదారి పక్కన కానీ భూమి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అలా కేటా యిస్తే... ఇప్పుడున్న మహిళా కళాశాల భూములను, భవనాలను కార్పొరేట్, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా... మంచి రీసెర్చ్‌ సెంటర్‌ని అభివృద్ధి చేయాలి. (క్లిక్: తొలి మహిళా వర్సిటీగా  కోఠి ఉమెన్స్‌ కాలేజీ)

ఇప్పటికే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి అందరికీ తెలిసిందే. నిధుల్లేక కునారిల్లుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది లేక క్లాసులు జరగడం లేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదు. ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్‌టీయూ లాంటి విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అను మతి ఇచ్చింది. ఫలితంగా ఉన్నత విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’ ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి! (క్లిక్: మరీ ఇంత రుసుమా.. ఉద్యోగాలకు అప్లై చేయాలా వద్దా?)

–  పి. మహేష్‌
పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top