మూడోకన్నుకు... 182 వసంతాలు

Srinivasa Reddy Special Article On World Photography Day - Sakshi

సందర్భం

1839వ సంవత్సరంలో ఫొటోగ్రఫీ ఆవిష్కరణ జరిగిన తరువాత క్రమంగా ప్రపంచ దేశాలు అన్నిటిలోకి ఈ ప్రక్రియ వ్యాపించటం మొద లైంది. ఈ క్రమంలో మన దేశంలోకి కూడా ఫొటోగ్రఫీ ప్రవేశించింది. ఆధా రాలని బట్టి సుమారు 1840లోనే మనదేశంలోకి ప్రవేశించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఆరోజుల్లో మొట్ట మొదటి వ్యాపారసంస్థను ఎఫ్‌. స్వ్రాన్‌హోపర్‌ అనే కమర్షియల్‌ ఫొటోగ్రాఫరు కలకత్తాలో కేలోటైపు ఫొటోగ్రఫీ ప్రక్రియతో ఒక స్టూడియోను ప్రారంభించినట్లుగా ఋజువులున్నాయి. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. యజమాన్యాలు ఎన్నిమారినా ఆ స్టూడియో ఇప్పటికి 8 చౌరంగీరోడ్డు కల కత్తాలో నిల్చి ఉన్నది. ఆ రోజుల్లోనే 1853లో రాయల్‌ ఫొటో గ్రాఫిక్‌ సొసైటీని ఇంగ్లాండులో స్థాపించారు. 1854లో ఫొటో గ్రాఫిక్‌ సొసైటీ ఆఫ్‌ బాంబే స్థాపించబడింది. మనదేశంలో ఇది మొట్టమొదటి ఫొటోక్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్‌ ఇండియాగా మార్పు చెందింది. ఇది ఇప్పటికీ ఫొటోగ్రఫీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. 1855లో ఈ క్లబ్బు మొట ్టమొదట ఫొటో ప్రదర్శనని ఏర్పాటు చేసింది. 

1840 తరువాత నెమ్మదిగా అనేక ఫొటోస్టూడి యోలు స్థాపితమై, ఫొటోగ్రఫీకి కావలసిన రసాయనాలు, పరికరాలు విక్రయించటం మొదలు పెట్టాయి.  హైదరాబాద్‌ సంస్థానంలో రాజా లక్ష్మణరావు నైజాం నవాబుల సంస్థానంలో సేవచేస్తూ గొప్ప పరిపాలనాదక్షతతో పేరుపొందారు. రాజాలక్ష్మణరావుకి ముగ్గురు కుమారులు: రాజ రామ్రాజ్, రాజాత్రయంబక్‌రాజ్, రాజా థోండేరాజ్‌ రాజా దీన్‌దయాళ్‌ ప్రోత్సాహంతో రాజాత్రయం బక్‌ కెమె రాని చేపట్టి ఛాయా చిత్రకారుడిగా పేరు పొందారు. ఛాయా చిత్రకళలో, ముద్రణలో, చిత్ర నిర్మాణంలో నిష్ణాతులైన, ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఆంగ్ల గురువుల వద్ద అభ్యాసం కోసం సాంకేతిక నైపుణ్య సాధనకు ఇంగ్లాండు వెళ్ళారు. ఛాయాచిత్ర కళకు మొదటిరోజులలో ప్రామాణికత అనేది లేదు. అటువంటి పరిస్థితులలోనే మంచి ఛాయా చిత్రకారుడిగా పేరు పొంది ఇంగ్లాండు దేశంలోని రాయల్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటి నుంచి తన ఛాయాచిత్రనైపుణ్యానికి గుర్తింపుగా ఎసోసియేట్‌ రాయల్‌ ఫొటోగ్రాఫిక్‌ సొసైటి  గౌరవపట్టాను తన మొదటి ప్రయత్నం లోనే సాధించగలిగారు. కెమెరా కంటే కెమెరా వెనుక ఉన్న కన్ను ఎంతో ముఖ్యమనేది ఆయనభావం. భారతదేశంలో కార్బన్‌ ప్రాసెస్‌లో వర్ణచిత్రాలను తయారు చేసిన ఘనత ఆయనదే.  రాజాత్రయంబక్‌ ఆంధ్రరాష్ట్ర అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీకి ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ 20వ తేదీ నవంబరు 1969వ సంవత్సరంలో పరమపదించారు.

డా. ఎన్‌ భగవాన్‌దాసు బ్రిటీస్‌ ఎయిర్‌ఫోర్సులో స్క్వాడ్రెన్‌ లీడరుగా పనిచేసి 1947లో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో ఆఫీసరుగా నియమితులయ్యారు. ఆంధ్రరాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో ఉన్న ఫొటోగ్రా ఫర్లని అందరినీ కలిపి ఒక సంఘం ఏర్పరచాలని నిర్ణయించి, ఎడ్వర్డ్స్‌. వి. బాపిరాజు ఇలా ఇంకా కొందరిని కలిసి వారితో చర్చించి రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫొటో గ్రాఫర్స్‌ అనే సంస్థని 1963 సంవత్సరంలో స్థాపించారు. అప్పటి నుంచి నిర్విరామంగా కృషి సల్పుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఫొటోగ్రఫీ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శిగా నియమించబడ్డారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోను కనీసం ఒక ఫొటోక్లబ్‌ ఉండాలనే ధ్యేయంతో ఎంతో కృషి చేశారు.

1966లో తొలిసారిగా ఎ.పి. శాలన్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫి తెలు గునేలపై తొలిసారిగా ఫొటో ప్రదర్శనను ఏర్పాటుచేయగా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రారంభించారు. గడచిన 54 ఏళ్ళలో ఎంతోమంది ఆర్ట్‌ ఫొటోగ్రఫీలో జాతీయ, అంత ర్జాతీయ పురస్కారాలు సాధించి దేశంలోనే ఫొటోగ్రఫీ రంగం లోను ఆకర్షినీయమైన రాష్ట్రంగా నిలిపారు. 2015లో జరిగిన రాజకీయ మార్పులతో అప్పటివరకు  కొనసాగుతున్న ఆంధ్ర ప్రదేశ్‌ స్టేట్‌ అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రíఫీ మార్పు చెంది తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ పేర్లుతో కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ లలో దాదాపుగా 300 మందికి పైగా సభ్యులు వివిధ అంశాల్లో వారివారి ప్రతిభకు గుర్తిస్తూ అంతర్జాతీయ పురస్కారాలు పొందారు.  ఈ ఏడాది 182వ ప్రపంచ ఫొటోగ్రíఫీ వేడుకలు జరుపుకొంటున్నాం. కళాత్మక ఛాయాచిత్రరంగంలో తెలుగు వారిదే పై చేయి కావాలని అంతర్జాతీయంగా భారతీయ మువు న్నెల జెండాను ఫొటోగ్రఫీ రంగంలో తెలుగు వారు ఎగరవే యడంలో ప్రథమంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలతో... 


టి. శ్రీనివాస రెడ్డి 
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ, ప్రధానకార్యదర్శి
(నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top