కాంగ్రెస్‌ కథ ముగిసినట్టా?

Sakshi Guest Column On Congress Party

కామెంట్‌

తమ పార్టీ తిరిగి ఎలాగైనా లేస్తుందని ఏ రాజకీయ నాయకుడైనా నమ్ముతాడు. ఆ పునరుజ్జీవనం తదుపరి ఎన్నికల్లో లేదా కొన్ని ఎన్నికల తర్వాత జరగవచ్చు. అలాంటప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పడం ‘హాస్యాస్పదమైన ఆలోచన’ అవదా? కానీ వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్న కాంగ్రెస్‌ పార్టీ విషయంలో అది ఎంతమాత్రమూ హాస్యాస్పదం కాకపోవచ్చు.

పార్టీలు ప్రభ కోల్పోతాయన్న విషయాన్ని ఆమోదించడానికి మీరు ఒకప్పటి బ్రిటన్‌ ఉజ్జ్వలమైన ఉదారవాదుల కేసి చూడనవసరం లేదు. మన దేశంలోనే అలాంటి  ఘటనలు చాలా సమీపంలో జరిగాయి. స్వతంత్ర, జనతా పార్టీ, బహుశా భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా అలాంటి స్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌ సొంత ఉదంతం విషయానికి వస్తే – బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల్లో క్షీణతను చవిచూశాక, అది అధికారంలోకి రాలేకపోయింది. 

ఓటమికి సంబంధించిన నిరాశా నిస్పృహల నడుమ ఉంటున్నప్పటికీ, తమ పార్టీల పున రుజ్జీవన సంకేతాలను రాజకీయ నాయకులు చూస్తున్నట్లయితే అది అర్థం చేసుకోదగినదే. ఆ పునరుజ్జీవనం తదుపరి ఎన్నికల్లో లేదా కొన్ని ఎన్నికల తర్వాత జరగవచ్చు. అలాంటప్పుడు వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు ఎదుర్కొన్న కాంగ్రెస్‌ పని అయిపోయిందని చెప్పడం ‘హాస్యాస్పదమైన ఆలోచన’ అవుతుందా? కచ్చితంగా కాదు.

ప్రభ కోల్పోయిన పార్టీలు
పార్టీలు ప్రభ కోల్పోతాయన్న విషయాన్ని ఆమోదించడానికి మీరు ఒకప్పటి బ్రిటన్‌ ఉజ్జ్వలమైన ఉదారవాదుల కేసి చూడనవసరం లేదు. మన దేశంలోనే అలాంటి ఘటనలు చాలా సమీపంలో జరిగాయి. స్వతంత్ర, జనతా పార్టీ, బహుశా భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా అలాంటి స్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌ సొంత ఉదంతం విషయానికి వస్తే – బిహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్ని కల్లో క్షీణతను చవిచూశాక, అది అధికారంలోకి రాలేక పోయింది.

అయినప్పటికీ, కాంగ్రెస్‌ కథ ‘ముగిసిందని’ చెప్పడం హాస్యాస్పదమైనదని రాహుల్‌ గాంధీ అతిశయిస్తున్నారంటే దాన్ని నిజమని రుజువు చేయాల్సి ఉంటుంది. ఊరికే వేచి ఉండడం ద్వారా, మంచి జరుగుతుందని ఆశించడం ద్వారా అది జరగదు. ప్రొఫెసర్‌ సుహాస్‌ పల్శీకర్‌ ఎత్తి చూపి నట్లుగా, ‘బహుళ పార్టీ సమాఖ్య రాజకీయాల్లో పోటీలో ఉండటం’ అనేది దాదాపు కాంగ్రెస్‌కు 35 ఏళ్లనుంచీ సవాలుగానే ఉంటోంది. 1989లో పార్టీ అధికారం కోల్పోయినప్పుడు ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి అది ప్రభుత్వంలో ఉంటూ వచ్చి నప్పటికీ, మెజారిటీని ఎన్నడూ గెలుచుకోలేదు. త్వరలోనే ఈ సవాలు ‘దాటలేనిది’గా మారి పోయింది. 

అలా జరగకూడదంటే, కాంగ్రెస్‌ పార్టీ సంస్థా గతంగా, రాజకీయ సమీకరణల పరంగా రెండు రంగాల్లో తప్పక పనిచేసితీరాలని పల్శీకర్‌ విశ్వాసం. ఆ పార్టీ ఆయన సలహాను పాటించడానికి సమ్మతించక పోయినప్పటికీ, ఉజ్జ్వల ప్రతిపక్షాన్ని కోరుకుంటూ, కాంగ్రెస్‌ పునరుత్థానంపై నమ్మకం పెట్టుకున్న మనలాంటి వారికి అది మంచి ఆశను కలిగిస్తోంది.

ఎన్నికలే ప్రాణ వాయువు
రాజకీయ సంస్థ గురించి పల్శీకర్‌ రెండు అంశాలు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, పార్టీ పనితీరును ప్రజా స్వామ్యీకరించడమే! వర్కింగ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా, పార్టీ ప్రజాస్వామ్యీ కరణ విషయంలో కాంగ్రెస్‌ విఫలమైంది. ఎన్నికలు సృష్టించే మథనం పార్టీకి ‘ప్రాణ వాయువు’ను ఇస్తుంది కాబట్టి ఇది ముఖ్యమైనదని పల్శీకర్‌ అంటారు. నామినేషన్లు అనేవి సుప్తావస్థను కొన సాగేలా చేస్తాయి.

రెండో సంస్థాగతమైన అవసరం ఏమిటంటే, ఒక కుటుంబానికి ఒక పదవి అనే నిబద్ధతను పూర్తి చేయడమే! ఇది గాంధీలకు మాత్రమే అన్వయించదు. ‘స్థానిక పార్టీ యూనిట్లను నియంత్రించే అనేక కుటుంబాల స్థిరపడిన ఆసక్తులతో ఇది ఎక్కువగా ముడిపడి ఉంది. ఇది ఎక్కువగా స్థానిక రాజకీయాల నిర్వహణకు సంబంధించినది’. ఈ ఆధిపత్య కుటుంబాలు ‘యువ కార్యకర్తలను స్పర్థాత్మక రాజకీయాల్లోకి అనుమతించడం’ ముఖ్యమని గుర్తించాల్సిన అవసరం ఉంది.

రాజకీయ సమీకరణపై కూడా పల్శీకర్‌ రెండు అంశాలను జోడించారు. పెద్ద మాటలు, పవిత్రమైన ఆశలను పక్కనపెడితే... కాంగ్రెస్‌ పార్టీ నిర్దాక్షిణ్యమైన పోటీదారును ఎదుర్కొంటున్న సమయంలో సంకీర్ణం కోసం సరైన ఫార్ములాను ఎంచుకోవలసిన అవసరముంది. ఆయన సలహా సరళమైనదే కానీ పదునైనది. ‘కాంగ్రెస్‌ పార్టీ మరింత నమ్రతతో ఉండడానికి సిద్ధం కావలసి ఉంటుంది’. మరో మాటలో చెప్పాలంటే, కాంగ్రెసే నాయకత్వం వహిస్తుందని పట్టుబట్టొద్దు.

సమర్థంగా వివరించాలి
సమీకరణ గురించిన రెండో అంశం మరింత సవాలుతో కూడుకున్నది. ఇది కాంగ్రెస్‌ సైద్ధాంతిక సందేశానికి సంబంధించింది. ‘ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం, మతతత్వం వంటి అంశాలపై ప్రజారాశులను పార్టీ ఎలా మేల్కొల్పబోతోంది?’ ఎందుకంటే ఇవి సాధారణ ప్రజలు పెద్దగా పట్టించుకోని నైరూప్య భావనలు. వారి రోజువారీ జీవి తాలకు అనువుగా వీటిని సమర్థంగా వివరించ కుంటే ఫలితం ఉండదు. ఇప్పటికైతే వీటిని చెబుతున్నప్పుడు వాటి అర్థం నష్టపోతోంది.

బీజేపీకి వ్యతిరేకంగా మతతత్వ ఆరోపణల గురించి మాట్లాడే విషయాలను పల్శీకర్‌ ప్రత్యేకించి నొక్కి చెప్పారు. ‘మంచి హిందువుగా ఉండటం లేదా మంచి జాతీయవాదిగా ఉండటానికి ముస్లిం వ్యతిరేకిగా ఉండాల్సిన అవసరం లేదని సగటు హిందువుకు అర్థం అయ్యేట్టు చెప్పాలి, ఇది కొంచెం కష్టమైన పనే’. దీనికి సమాధానం ఏమిటంటే తన సొంత హిందూ విశ్వసనీయతపై ఆడంబరంగా చెప్పుకోవలసిన పనిలేదు కానీ హిందూయిజం గురించి కాంగ్రెస్‌ మాట్లాడాల్సి ఉంది. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం గురించి అది విభిన్నరీతిలో నొక్కి చెప్పాల్సి ఉంది. కానీ ఇది చేయడం కంటే చెప్పడం సులభం!

హాస్యాస్పదం కాదు
కాంగ్రెస్‌ పార్టీ తన సందేశాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడం ఓటర్ల దృష్టిలో ఎంతో విలువైన విషయం. కులం, తెగ,సంస్కృతి, ఆహార ప్రాధాన్యతలు వంటి అంశాల్లో వ్యత్యాసాలను అధిగమించడం చాలా కష్టమైన పని. ఇది నేను ఎక్కడ మొదలెట్టానో అక్కడికే నన్ను తీసుకెళుతోంది. సవాలును కాంగ్రెస్‌ అధిగమించలేకపోతే, పార్టీ భవిష్యత్తు సందేహంలో పడుతుందని సుహాస్‌ పల్శీకర్‌ చెప్పడం నిజంగా హాస్యా స్పదమైన విషయమేనా? కాకపోతే ఈశాన్య భారత్‌లో ఫలితాలు భిన్నమైన విషయాన్ని సూచి స్తున్నాయి. అయినా కూడా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను నిలుపుకోవడంలో విఫలమైతే, కర్ణాటకలో గెలుపు సాధించలేకపోతే మాత్రం అది స్పష్టమైన సంకేతం. తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు ఎటూ ఉండనే ఉన్నాయి.

అయితే, అయితే, అయితే... బ్రిటన్‌లో కేమరాన్‌ నాయకత్వంలో తిరిగి అధికారంలోకి రావడానికి ముందు వరుసగా మూడు ఎన్నికల్లో టోరీలు ఓడిపోయారు. లేబర్‌ పార్టీ అదృష్టాన్ని టోనీ బ్లెయిర్‌ మార్చివేయడానికి ముందు నాలుగు సార్లు ఆ పార్టీ కూడా అపజయం ఎదుర్కొంది. అయితే, రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి అలాంటిది తెచ్చిపెట్టగలరా అనేదే ప్రశ్న!

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top