ఆనందం ఉన్నచోటనే ఐశ్వర్యం | Sakshi Guest Column On American comedian Jerry Seinfeld Speech | Sakshi
Sakshi News home page

ఆనందం ఉన్నచోటనే ఐశ్వర్యం

Apr 2 2026 12:10 AM | Updated on Apr 2 2026 12:10 AM

Sakshi Guest Column On American comedian Jerry Seinfeld Speech

అమెరికన్‌ హాస్య నటుడు, నిర్మాత, రచయిత జెరీ సైన్‌ఫెల్డ్‌ నార్త్‌ కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ పట్టభద్రులను ఉద్దేశించి చేసిన స్నాతకోపన్యాస సంక్షిప్త పాఠం:

విశ్వగురు

అభిరుచికి తగ్గ రంగాన్ని ఎంచుకోండని చెప్పిన మాటలను విని విని మీరు ఎంతగా విసిగిపోయి ఉంటారో నేను ఊహించగలను. నేనైతే మక్కువ లేదు గిక్కువ లేదు అనే అంటాను. మీరు చేయగలిగిన ఏదైనా గొప్ప పనిని చేపట్టవలసిందని చెబుతాను. అటువంటి దాన్ని ప్రయత్నించి విఫలమైనా ఫరవాలేదు. స్వతహాగా దేనిమీద మక్కువ ఉందో కనిపెట్టి దాన్ని చేప్టటా లనే ఆలోచనను వదిలేయండి. నాకు బాగా అభిరుచి కలిగిన ఉద్యోగ మంటూ చొక్కాలు చించుకోవద్దు. ఏ ఉద్యోగంలో చేరినా ఆ ఉద్యో గానికి మీ శక్తియుక్తుల మేరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించండి. ఆ పనిని ఇష్టపూర్వకంగా చేసేందుకు సుముఖులు కండి. భావావేశంతో అతిగా శ్రమించి ఆయాసపడనక్కర లేదు. అది మీ తోటి ఉద్యోగులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఆడుతూ పాడుతూ చేస్తే చాలు. చెమటలు కక్కనవసరం లేదు. 

మూడు కీలక సూత్రాలు
జీవితంలో నేను అనుసరించిన మూడు కీలక సూత్రాలను చెబుతాను. ఒకటి– శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించండి. రెండు– దృష్టి పెట్టండి. మూడు– ప్రేమలో పడండి. మీరు ఏ పని చేపట్టినా సరే– అది మీ ఉద్యోగం, కాలక్షేపం, లేదా సాంగత్యం ఏదైనా కావచ్చు. అది ఏ రకమైనదో అనవసరం. కానీ, చేసే పనిలో ప్రయత్న లోపం ఉండకూడదు. కృషి ఫలించి తీరుతుంది. అది సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఫలితం మనం ఆశించి నట్లుగా రాకపోయినా, ప్రయత్న లోపం లేదనే తృప్తి మనకు మిగులుతుంది. ఇది జీవన సూత్రం. జీవితంలో చాలా విషయాల్లో ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు. సముద్ర గర్భంలోకి తీసు కెళ్ళే వస్తువులో కూర్చున్నారనుకోండి. మునిగిపోయిన టైటానిక్‌ ఓడ దగ్గరకు వెళుతున్నారు. కెప్టెన్‌ చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. సముద్ర గర్భం నుంచి ఆ నౌకను తిరిగి రేవుకు చేర్చడం కుదిరే పని కాదని మీకే అర్థమవుతుంది. చేపలకది సహజ నివాస ప్రాంతం కనుక, మనకన్నా తేలికగా అవి అక్కడ సంచరించగలుగుతాయి. అది వాటి సహజ సామర్థ్యం అనుకుని వదిలేయాలి. మనం ఏదో చేయలేకపోతున్నామని మనో వేదనకు గురికాకూడదు.

అలాగే, మనుషులతో ప్రేమలో పడటం తేలిక. కానీ, ఇది అది అని కాకుండా అన్నింటితోను ప్రేమలో పడండని చెబుతాను. మీకు ఏది లభిస్తే దానిపైనే మక్కువ పెంచుకోండి. అది మీరు తాగే కాఫీ, వేసుకునే స్నీకర్స్‌ లేదా కారు నిలిపే పార్కింగ్‌ ప్లేస్‌ ఏదైనా కావచ్చు. లభించిన దానిపై ఇష్టం పెంచుకోవాలి. చిన్న చిన్న వాటిని చూసి కూడా ఆనందించడం నేర్చుకోవాలి. జీవితంలో పెద్ద పెద్ద సమస్య లను పక్కనపెట్టి, అందుబాటులో ఉన్న చిన్నవాటిపైనే దృష్టి పెడుతూ జీవితాన్ని ఆనందంగా గడిపాను. మీకు ఏది మంచిదని పిస్తోందో దాన్ని కనుగొనండి. దానిలో కొన్ని చెడ్డవి ఉంటే వాటిని పట్టించుకోవద్దు. ఏది సౌకర్యకరంగా ఉంటుందో, ఒత్తిడిని ఎంత వరకు భరించగలరో చూసుకోండి. జీవితంలో విజయానికి ఇది బంగారు బాట. పని, వ్యాయామం, సాంగత్యాలు హింసకు గురి చేస్తాయి. కానీ, అవి నూరు శాతం కాదు, వెయ్యి శాతం అందుకు అర్హమైనవే. కనుక, కష్టపడటంలో తప్పు లేదు. 

శ్రమలోనే సౌందర్యం
పనికన్నా అద్భుతమైనది మరొకటి లేదు. చేస్తున్న పనిలో మమేకం అయ్యే వారి గురించి వినే ఉంటారు. వారు అలా ఎక్కువ సమయాన్ని ఆఫీసుకు ఎలా  వెచ్చించగలుగుతారో తెలుసునా? అది చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. అంకిత భావంతో పనిచేయ లేనప్పుడు ఆ ఉద్యోగాన్ని పట్టుకుని వేలాడటం కన్నా దాన్ని వదిలే యడమే మంచిది. లేకపోతే అది స్వయం కృతాపరాధం అవుతుంది. పనిని నిందించవద్దు. ఏ పనైనా అద్భుతమైనదే. నేను అంత కష్టపడి ఉండాల్సింది కాదు, తక్కువ పని చేసినా సరిపోయేది అనే సందర్భం జీవితంలో ఎన్నడూ రాకూడదు. అలా అనిపించే పక్షంలో అసలు ఆ పనిలో కొనసాగకపోవడమే మంచిది. ఏడీ, ఏమై పోయాడు అని ఎవరైనా అడిగితే, తినడానికి ఏదో తెచ్చుకుంటానని వెళ్ళాడు అని ఎవరో ఒకరు జవాబిస్తారు. వద్దు అనుకున్నాక మళ్ళీ ఆ గడప తొక్కకూడదు.

హాస్య చతురతను కోల్పోవద్దు!
జీవితంలో హాస్య స్ఫూర్తి చాలా అవసరం. అది జీవితంలో కష్టమైన దశల్లో కూడా ఊరట కల్పిస్తుంది. ఇవాళ దాని గురించే ప్రధానంగా చెప్పాలనుకున్నాను. ఇక్కడున్న వారిలో రెండు తరా లకు చెప్పదగిన విశ్వాసం, అనుభవం నాకున్నాయి. నేను 70వ పడిలో పడ్డాను. జీవితంలో ఇప్పుడిప్పుడే మీరు అడుగులేయడం ప్రారంభిస్తున్నారు కనుక ఈ విషయంలో మీకు నేను సహాయపడ దలచుకున్నాను. ఒక్కోసారి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే హాస్య మైనా ఫరవాలేదు. దాన్నేదో చక్కదిద్దడానికి మనం ప్రయత్నించ నవసరం లేదు. అది మరీ హద్దులు దాటేదిగా ఉండకూడదంతే. 

మరింత న్యాయబద్ధమైన, సమ్మిళిత సమాజ నిర్మాణానికి మీరు కంటున్న కలలను నేను పూర్తిగా అభినందిస్తున్నాను. ఎదుటి వారి మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు మీరు చూపుతున్న జాగరూకత కూడా అద్భుతమైనదే. శతవిధాలా అందుకు ప్రయ త్నించవలసిందే. కానీ, ఒక కమెడియన్‌గా నేను మీకొక సంగతి చెప్పదలచుకున్నాను. హాస్య చతురతను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. హాస్యాన్ని హాస్యంగా స్వీకరించడం అలవరచుకోవాలి. జీవితంలో మున్ముందు దశల్లో ఒడుదుడుకులను తట్టుకుని ముందుకు సాగేందుకు అది ఎంతగా సహాయపడుతుందో, జీవితంలో ప్రస్తుత దశలో మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. 

హాస్య స్పూర్తి లేకుండా జీవితంలో బతికి బట్టకట్టడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో మనసు చివుక్కుమనిపించినా, తట్టుకుని, చతురోక్తి విని ఆనందించగలగాలి. జీవిత చరమాంకంలో, అరే, మనం జీవి తంలో హాస్యాన్ని అంతగా అనుభవించలేకపోయామే అనే పరిస్థితి రాకూడదు. మానవ అనుభవాలనే ప్రవాహంలో ముందుకు సాగేందుకు హాస్యం శక్తిమంతమైన నావలా పనిచేస్తుంది. మానవులంద రికీ ఉండి తీరవలసిన లక్షణం హాస్య చతరుత. 

జీవితంలో డబ్బు ఎలాగో ఒకలా సంపాదించుకుంటాం. దాని గురించి ఎక్కువ మథనపడిపోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్జన అనే మాయాజాలంలో చాలామంది చిక్కుకుపోవడాన్ని గమ నిస్తున్నాను. దాన్నికాస్త పక్కన పెట్టండి. సంపాదనపై కాక, ఉన్నంతలో ఆనందంగా గడపడమెలా అనే దానిపై దృష్టి పెట్టండి. మీరే ఒక సంపదగా పరిణమించండి. ఆనందం ఎక్కడ ఉంటుందో ఐశ్వర్యం అక్కడ ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement