Andhra Pradesh: విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ

Andhra Pradesh Advancing in The Field of Education: Opinion - Sakshi

అభిప్రాయం

విద్యాభివృద్ధి మీదే సమాజాభివృద్ధి అధారపడి ఉంటుంది. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను అధికారం చేపట్టిన వెంటనే ముందు విద్యా రంగంపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’లో భాగంగా ప్రభుత్వ బడులలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారు. తొలి దశ క్రింద 15,715 స్కూళ్లలో సదుపాయాలను కల్పించగా... ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. ఈ దశలో స్కూళ్లతో పాటుగా కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, డైట్‌తో పాటు శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రాథమిక తరగతి నుండి ఇంటర్‌ వరకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా విద్యార్థులను పాఠశాలకు రప్పించడానికి ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలను ఆమె ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. పాఠశాల ప్రారంభంలోనే ‘జగనన్న విద్యా కానుక’ రూపంలో విద్యార్థులకు బుక్స్, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు ప్రతి విద్యార్థికి అందిస్తోంది. 

అలాగే ఉన్నత విద్య చదవాలన్న ఆసక్తి కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ‘జగనన్న విద్యాదీవెన’, ‘వసతి దీవెన’ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సహాయం అందిస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులు అన్ని కోర్సులకు చెల్లించే ఫీజును తిరిగి విద్యార్థులకే చెల్లిం చాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘జగనన్న విద్యాదీవెన’ ద్వారా 24.74 లక్షల మంది విద్యార్థులకు రూ. 8,365 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లింపులు జరిగాయి. ‘జగనన్న వసతి దీవెన’ కింద 18.77 లక్షల మందికి రూ. 3349.57 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ఈ మూడేళ్లలో 44.5 లక్షల మంది ఖాతాల్లో రూ. 19617.60 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 98 శాతం మందికి విద్య అందుబాటులోకి వచ్చిందని నీతి ఆయోగ్‌ తన నివేదికలో పేర్కొంది. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణతోనే సమన్యాయం)

రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో చేస్తున్న అనేక రకాల సంస్కరణల్లో మరొకటి ఇంటర్‌ విద్యను, పాఠశాల విద్యను కలిపి ‘ప్లస్‌ 2’ చేయడం. దీనివలన మూడవ తరగతి నుండి ఇంటర్మీ డియట్‌ వరకు విద్య ఒకే చోట దొరుకుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని మూడు నుంచి ఆరేళ్ల వయస్సుగల పిల్లలకు అందించడంలో ఏపీ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ‘ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ ఎడ్యుకేషన్‌’ (ఈసీఈ) అమలులో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పేద విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో జ్ఞానాన్ని అందించే క్రమంలో  ‘విద్యా కానుక’లో భాగంగా ఈ ఏడాది 4.70 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు, దాదాపు 50 వేల మంది టీచర్లకు 665 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్‌లను ప్రభుత్వం అందించనున్నది. ఇలా ఏపీ విద్యాసంస్కరణలతో ముందుకు దూసుకు పోతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.


- వి.వి. రమణ
సామాజిక విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top