ఆక్సిజన్‌ తెచ్చింది

woman loco pilot neelima kumari, bring in life-saving Oxygen for Karnataka - Sakshi

జార్ఖండ్‌ నుంచి ఒక రైలు బయలుదేరింది. అయితే అది మామూలు రైలు కాదు. ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’. దాదాపు 2000 కిలోమీటర్ల దూరం.... 27 గంటల ప్రయాణం. ముగ్గురు టీమ్‌. వారిలో లోకో పైలెట్‌ నీలిమా కుమారి కూడా ఉంది. ప్రాణాలు కాపాడే ప్రాణవాయువును తీసుకొని ఆఘమేఘాల మీద ఆమె బెంగళూరు చేర్చి ప్రశంసలు అందుకుంది.

కోవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా దేశంలోకి చాలా కీలకమైన విషయంగా మారాయి. ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్ల నుంచి ఆఘమేఘాల మీద ఆక్సిజన్‌ను చేరవేయడానికి భారత ప్రభుత్వం ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’లను మొదలెట్టింది. అంటే ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఉన్న గూడ్స్‌ రైళ్లు ఇవి. వీటిని గమ్యానికి చేర్చడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. మామూలు గూడ్సు రైళ్లు అయితే ఆగినా, ఆలస్యమైనా పర్వాలేదు. కాని ఆక్సిజన్‌ రైలు మాత్రం సమయానికి చేరుకోవాల్సిందే. ఇటీవల అలా సమయానికి చేర్చి ప్రశంసలు అందుకున్న లోకో పైలెట్‌ (డ్రైవర్‌) నీలిమా కుమారి.

జార్ఖండ్‌ నుంచి
సోమవారం (మే 17) ఉదయం 7 గంటలకు జార్ఖండ్‌లోని జోలార్‌పేట్‌ డివిజన్‌ నుంచి 120 టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌తో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరింది. బెంగళూరు డివిజన్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది ఈ ట్రైనును గమ్యానికి చేర్చాలి. వారిలో సీనియర్‌ సిబ్బంది అయిన కుమార్‌ (బిహార్‌), వలి (కర్ణాటక) ఉంటే అసిస్టెంట్‌ డ్రైవర్‌గా నీలిమా కుమారికి బెంగళూరు డివిజన్‌ బాధ్యత అప్పజెప్పింది. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు మొదలయ్యాక మహిళా డ్రైవర్‌ను ఈ బాధ్యతకు ఉపయోగించడం ఇదే మొదటిసారి. బిహార్‌కు చెందిన నీలిమా కుమారి ఒక సంవత్సర కాలంగా బెంగళూరు డివిజన్‌లో లోకో పైలెట్‌గా పని చేస్తోంది. ఆమె వివాహిత. ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. జార్ఖండ్‌ నుంచి ఆక్సిజన్‌ను తీసుకొచ్చే బాధ్యత ను ఆమె సవాలుగా స్వీకరించింది.

100 కిలోమీటర్ల వేగంతో
ముగ్గురు సిబ్బంది తమ భుజాల మీద ఉన్న బాధ్యతను సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 25 గంటలు నాన్‌స్టాప్‌గా రైలును నడపాలి. అందుకు సిద్ధమయ్యారు. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ బెంగళూరు చేరడానికి మధ్యలో సిగ్నళ్ల అంతరాయం లేకుండా లైన్లు క్లియర్‌ చేయబడ్డాయి. 100 కిలోమీటర్ల వేగంతో రైలు గమ్యానికి చేరాల్సి ఉంటుంది. అనుకున్నట్టుగానే మధ్యలో ఒకటి రెండు చోట్ల తప్ప ముగ్గురూ కలిసి రైలును మరుసటి రోజు (మే 18) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరుకు చేర్చారు. ‘ఇది నాకెంతో సంతోషం కలిగించింది. కష్టాల్లో ఉన్నవారిని సకాలంలో ఆదుకునేందుకు మా రైలు సమయానికి చేరడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఆ పనిని సక్రమంగా చేయగలిగాను’ అని నీలిమా కుమారి అంది. సీనియర్‌ డ్రైవర్‌ కుమార్‌ ‘నా సర్వీసులో ఇంత ఉపయోగకరమైన డ్యూటీ ఎప్పుడూ చేయలేదు’ అనంటే మరో సీనియర్‌ డ్రైవర్‌ వలి ‘నేను రైలు మొదలైనప్పటి నుంచి గమ్యం చేరేంత వరకు ఇంజన్లో నిలబడే ఉన్నాను. కంటి మీద కునుకు వేయలేదు’ అన్నాడు. ఎందరో మహానుభావులు. అందుకే కరోనా బాధితులు సమయానికి సహాయం పొందగలుగుతున్నారు. కాకుంటే ఒక మహానుభావురాలు కూడా ఉండటం విశేషం కదా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-05-2021
May 23, 2021, 02:08 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం వికారాబాద్‌ జిల్లాకు...
23-05-2021
May 23, 2021, 02:07 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి గణ నీయంగా తగ్గుతోంది. పక్షం రోజుల క్రితం వరకు నిర్ధారణ పరీక్షల్లో...
23-05-2021
May 23, 2021, 01:43 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణ అంటే.. మొదటగా టెస్టుల్లో పాజిటి విటీ రేట్‌ తగ్గుతుంది. ఆ తర్వాత...
23-05-2021
May 23, 2021, 01:29 IST
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు కొంత తగ్గుముఖం పడుతూ రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ.. ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర...
23-05-2021
May 23, 2021, 01:27 IST
కార్మిక సంఘాల పోరుబాటలో జీవిత చరమాంకం వరకు పిడికిలి బిగించి ముందు వరుసలో నడిచిన జ్యోత్స ్న బసు.. కరోనా...
22-05-2021
May 22, 2021, 21:46 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించనివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ను...
22-05-2021
May 22, 2021, 20:54 IST
బీజింగ్‌: కోవిడ్‌ వ్యాప్తి మొదలైనప్పుడు మాజీ అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనాను చైనీస్‌ వైరస్‌ అని ఆరోపించిన సంగతి తెలిసిందే....
22-05-2021
May 22, 2021, 17:57 IST
హైదరాబాద్‌: కరోనా నిబంధనలు పాటిస్తూ.. స్వీయ రక్షణకు సమష్టి నిర్ణయాలు తీసుకొని ఆచరిస్తూ కంటికి కనిపించని వైరస్‌ అనే శత్రువుతో...
22-05-2021
May 22, 2021, 17:11 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా బాధితులకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్ష బ్లాక్‌మార్కెట్‌ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెమ్‌డెసివర్‌ను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని...
22-05-2021
May 22, 2021, 16:42 IST
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లు మారుస్తుండగా...
22-05-2021
May 22, 2021, 15:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో...
22-05-2021
May 22, 2021, 15:40 IST
సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ పేరిట పోలీసులు విద్యుత్‌ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మే...
22-05-2021
May 22, 2021, 12:11 IST
సిడ్నీ: ‘‘థాంక్యూ ఇండియా.. నన్ను సొంత మనిషిలా ఆదరించారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే గుండె పగిలిపోతోంది. దయార్ద హృదయం,...
22-05-2021
May 22, 2021, 11:19 IST
లక్నో: ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి పోలీసులు పగలు, రాత్రి శ్రమిస్తున్నారు. తమ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ వీలు...
22-05-2021
May 22, 2021, 10:06 IST
రూ. కోటి మాత్రమే కాదు, ఆయన భార్యకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం
22-05-2021
May 22, 2021, 09:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్‌ ఆంక్షలను పొడగిస్తున్నాయి. అయితే కరోనా వైరస్‌కు...
22-05-2021
May 22, 2021, 09:08 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు టీకాలు అందించే విషయంలో ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్లనే వ్యాక్సిన్ల కొరత సమస్య ఎదురైందని  సీరమ్‌...
22-05-2021
May 22, 2021, 08:43 IST
సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: కోవిడ్‌ వచ్చి తగ్గినవారిలో పూర్తిగా  కోలుకుంటున్నవారు, కొద్దిరోజులపాటు  ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు.  కానీ  కొందరిలో కోవిడ్‌ తగ్గిన...
22-05-2021
May 22, 2021, 07:56 IST
సాక్షి, మంచిర్యాల: మండలంలోని తాళ్లపేటలో ఓ కుటుంబాన్ని కరోనా చిదిమేసింది. పదిహేను రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకుంది....
22-05-2021
May 22, 2021, 07:36 IST
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టీమ్‌కు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా భారత ఒలింపిక్‌ సంఘం అరుణ్‌ను నియమించింది
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top