రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా? | What Are The Ways To Find Lost Things In Indian Trains, Know Details About This Process Inside - Sakshi
Sakshi News home page

రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?

Published Wed, Mar 20 2024 5:16 PM

What Are The Ways To Find Lost Things In Indian Trains - Sakshi

సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఒక్కొసారి విలువైన వస్తువులు పొరపాటున మర్చిపోతుంటాం. చాలామంది వాటిని తిరిగి పొందేందుకు(క్లైయిమ్‌ చేసుకునేందుకు) ప్రయత్నించారు. ఆ ఇంకెక్కడుంటుంది. ఈపాటికి ఎవరో ఒకళ్లు పట్టుకుపోయి ఉంటారులే అనుకుంటారు. ఓ మూడు, నాలుగురోజులు అబ్బా..! అలా ఎలా వదిలేశాను? అని తెగ బాధపపడిపోతూ.. మర్చిపోయే యత్నం చేస్తారు. చాలామటుకు అందరూ ఇలానే చేస్తారు. అలా బాధపడనక్కర్లేకుండా ఆ వస్తువులను ఎలా తిరిగి సంపాదించుకోవాలి? వాటిని రైల్వే అధికారులు, సిబ్బంది ఏం చేస్తారు తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!.

రైలులో ఎవ్వరైనా ఏదైన విలువైన వస్తువు మర్చిపోతే బాధపడుతూ కూర్చొనవసరం లేదు. పైగా ఇక దొరకదనుకుని డిసైడ్‌ అయ్యే పోనక్కర్లేదు. ఏం చేయాలంటే?..మనం వస్తువుని రైల్లో మరచిన వెంటనే చేయాల్సింది.. మన టిక్కెట్‌ని జాగ్రత్త చేయాలి. ఇప్పుడూ మొబైల్‌ ఫోన్‌కి టికెట్‌ వచ్చినట్లు మెసేజ్‌ వస్తుంది కాబట్టి దాన్ని డిలీట్‌ చేయకూడదు. ఆ తర్వాత మనకు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ అధికారులకు తెలియజేయాలి. వారు విచారించి మీరు ప్రయోణించిన ట్రైయిన్‌ తాలుకా లిస్ట్‌ తీసి.. ఆ రైలు లాస్ట్‌ స్టేషన్‌ వద్ద సిబ్బంది కలెక్ట్‌ చేసిని వస్తువుల సమాచారం లిస్ట్‌ని తీయడం జరుగుతుంది.

ఆయా వ్యక్తులు పలానా ట్రెయిన్‌లో తాము ఈ వస్తువు మర్చిపోయామని పూర్తి వివరాలను తెలియజేస్తే..ఆ జాబితాలో ఉందా లేదా అనేది నిర్థారిస్తారు అధికారులు. ఆ తర్వాత సదరు వ్యక్తి కోల్పోయిన వస్తువు వివరాలు, ప్రయాణించిన ట్రైయిన టిక్కెట్‌ ఆధారంతో అతడి వస్తువని నిర్థారించుకుంటారు. ఆ తర్వాత రైల్వే అధికారులు అతడు పొగొట్టుకున్న వస్తువులను అందచేయడం జరుగుతుంది. అలాగే ఇలా రైలులో యాత్రికులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది కలెక్ట్‌ చేసి రైల్వే మాస్టర్‌కి అందజేస్తారు.

ఆ తర్వాత ప్రయాణికులెవరైనా.. వచ్చి కలెక్ట్‌ చేసుకోవాడానికి వస్తారేమో!.. అని కొన్ని రోజులు వేచి చూస్తారు. రానీ పక్షంలో వాటిని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే రైల్వే అధికారిక మార్గదర్శకాలను తెలుసుకుంటే సరిపోతుంది. అది ఐఆర్‌సీటీసీ సైట్‌లో లేదా రైల్వేస్టేషన్‌ అడిగి సవివరంగా తెలుసుకోవచ్చు. ఇక నుంచి రైలులో వస్తువు పోతే దొరకదని వదిలేయకండి. కనీసం రైల్వే హెల్ప్‌ సెంటర్‌కి కాల్‌ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే యత్నం చేయండి. 

(చదవండి: బొటాక్స్‌ ఇంజెక్షన్‌లు ఇంత డేంజరా? మైగ్రేన్‌ కోసం వాడితే..!)

Advertisement

తప్పక చదవండి

Advertisement