
థాయ్‌ల్యాండ్‌లోని ఓ రెస్టారెంట్, కస్టమర్స్‌కి విచిత్రమైన ఆఫర్ ఇస్తోంది. ఇక్కడ భోజనం ఆర్డర్ చేయడానికి ముందు ‘మెటల్ గేట్ చాలెంజ్’ అనే ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొనాలి. అంటే ఒక ఐదు రకాల వెడల్పు అయిన మెటల్ బార్స్ మధ్య ఏర్పాటు చేసిన సన్నని సందు నుంచి బయటకు రావాలి.
ఎంత సన్నని సందు నుంచి బయటకు వస్తే, అంత పెద్ద డిస్కౌంట్ ఇస్తారు. అలా ఐదు నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ పొందచ్చు. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వివిధ చర్చలకు దారితీసింది.
చాలామంది ఫన్నీగా తీసుకున్నా, కొంతమంది మాత్రం దీనిని బాడీషేమింగ్‌గా పేర్కొంటూ మండిపడుతున్నారు. కాని, హోటల్ యజమానులు మాత్రం ‘ఇది ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి చేసిన వినోదాత్మక ప్రయోగం’ అని అంటున్నారు.
(చదవండి: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!)