
వేసవిలో మల్లెలు పంచే పరిమళం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం అలంకరణకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలను దూరం చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. తాజాగా ఉన్న మల్లెల్ని మెత్తగా నూరి.. తడిబట్టపై చుట్టి కళ్లపై పెట్టుకోవాలి.
ఇలా చేస్తే కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు ఉండటం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది.
ఇక మీకెప్పుడైనా తలనొప్పి లేదా తలంతా పట్టేసినట్టు ఉంటే మల్లెపూలతో వాసెన కట్టులా కడితే ఉపశమనం కలుగుతుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది.
ఇలా మాత్రం చేయకండి!
స్నానం చేసేటప్పుడు శరీరానికి సోప్ అప్లై చేశాక లూఫాతో రుద్దుతుంటాం.
అయితే చాలాసార్లు స్నానం తర్వాత మనం లూఫాను శుభ్రం చేయకుండా వదిలేస్తాం.
మరుసటి రోజు మళ్లీ అదే లూఫాతో ఒంటిని రుద్దుతాం.
ఇలా చేయడం వల్ల ఆ లూఫాలో పేరుకు పోయిన బాక్టీరియా శరీరాన్ని చేరి అలర్జీ సంబంధిత సమస్యలు వస్తాయి.
కాబట్టి లూఫాను శుభ్రం చేశాకే వాడాలి.
మీకు తెలుసా?
భారతదేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల్లో నివసించే ప్రజలు సరైన నిద్ర పోవడం లేదని ఓ సర్వేలో తేలింది.
అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని 59 శాతం మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు.
మొబైల్ వాడకమే అందుకు కారణం.
చదవండి👉🏾Hair Care Tips: వాల్‌నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల