కరోనా పచ్చబొట్లు

Spain Tattoo Artist Awareness With Tattoos on COVID 19 Virus - Sakshi

‘ఈ మహమ్మారి కాలంలో ప్రజలు వ్యాధి పట్ల అవగాహ కలిగి ఉండాలి. అప్పుడే వ్యాధి విస్తృతికి అడ్డుకట్ట వేయవచ్చు’ అని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని సృజనశీలురు ఒక్కో విధంగా తమ ఆలోచన ద్వారా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. వారిలో టాటూ డిజైనర్లూ ఉన్నారు. పచ్చబొట్లు వేయించుకునేవారి కోసం కరోనా డిజైన్లను సృష్టించారు. కరోనా నుండి రక్షించుకునే మార్గాలను చూపుతూ సృష్టించిన ఈ టాటూ డిజైన్లు యువతరాన్ని ఆకర్షిస్తూ ట్రెండ్‌లో ఉన్నాయి. 

స్పెయిన్‌కు చెందిన ఆండ్రెస్‌ వేగా 21 ఏళ్లుగా పచ్చబొట్టు డిజైన్స్‌ వేస్తున్నాడు. ‘కోవిడ్‌ –19 సమయంలో నిపుణులు ఇచ్చిన సూచనలు ప్రజలు పాటిస్తున్నారు. వీటినే పచ్చబొట్టుగా వేయించుకోవడానికి చాలా మంది కస్టమర్లు ఇష్టపడుతున్నార’ని అంటాడు ఆండ్రెస్‌. ఆండ్రెస్‌ తన పచ్చబొట్టులో మాస్క్‌ ధరించిన ఒక మహిళా నర్సు డిజైన్‌ వేశాడు. అందమైన పువ్వులతో చేసిన డిజైన్‌ను నర్సు ఫోటో దిగువ భాగంలో వేశాడు. 

వైరస్‌ డిజైన్లు.. వైరల్‌
లాక్డౌన్‌ సమయంలో ఇంటి లోపల కరోనా గురించి తీసుకునే జాగ్రత్తలతో క్లయింట్‌ కోసం సృష్టించిన పచ్చబొట్లు హ్యాండ్‌ వాష్, మాస్క్, కరోనా వైరస్‌ డిజైన్లను యువతరం ఇష్టపడుతోంది. కరోనా కాలంలో ఈ పచ్చబొట్లు ప్రజలపై సరైన ప్రభావం చూపుతున్నాయంటున్నాడు ఈ టాటూ డిజైనర్‌.

కరోనా గుర్తుగా కొంతమంది ఈ డిజైన్స్‌ని లాక్డౌన్‌ టైమ్‌గా గుర్తుంచుకునే మార్గంగా కూడా భావిస్తున్నారట. దీంతో ఇలాంటి పచ్చబొట్లు వేయించుకోవడానికి గల ఏ ఒక్క అవకాశాన్నీ యంగ్‌స్టర్స్‌ వదులుకోవడం లేదు.  

వినియోగదారుల అభిరుచి కోసం తయారు చేసిన ఈ పచ్చబొట్లు ప్రస్తుత కాలంలో స్టైల్‌గానూ కనిపిస్తున్నాయి. మొత్తానికి కరోనా కాలంలో వచ్చిన కొత్త ఆలోచనతో టాటూ డిజైనర్లు సరికొత్త ఉపాధిని పొందుతున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top