స్మార్ట్‌ ఫోనుల్లో చాలా మంది చేసే తప్పులు ఇవే.. మరి ఏం చేయాలి? 

Is the phone hacked?! - Sakshi

గీతిక (పేరుమార్చడమైనది) డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. ఈ మధ్య తన క్లాస్‌మేట్‌ (నందు) చేసే మెసేజ్‌లు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తను ఎక్కడ ఉన్నా, ఏం  చేస్తున్నా అందుకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి తనకే పోస్ట్‌ చేస్తున్నాడు. ఎవరికైనా చెబుదామంటే ఎవరూ నమ్మరు. పైగా తననే నిందిస్తారు. తను ఊళ్లో లేకపోయినా తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తిరిగి తనకే పంపిస్తున్నాడు. ఏమైనా అంటే, నాకు అన్నీ తెలుసు.. అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇది ఇబ్బందికరంగా ఉండటమే కాదు భయంగానూ ఉంటోంది. 

గీతిక లాగే చాలా మంది ఇబ్బందులకు లోనయ్యే సమస్య ఇది. తమ ఫోన్‌ హ్యాక్‌ అయిందనే విషయాన్ని ఏ మాత్రం పసిగట్టలేరు. అంత స్మార్ట్‌గా మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ ఫోనుల్లో దొంగలు దూరుతున్నారు జాగ్రత్త. 

స్మార్ట్‌ ఫోన్‌లలో చాలా మంది చేసే కొన్ని తప్పులు ఏంటంటే..
మనం ఏం చేస్తున్నామో మిగతా అంతా చూసేలా చేయడం.
అలెక్సా వంటి టూల్స్‌ వాటంతట అవే రన్‌ అయ్యేలా చేయడం 
ఎప్పుడూ యాప్స్‌ సైన్‌ ఇన్‌లోనే ఉండటం 
స్మార్ట్‌ ఫోన్‌ యాక్సెస్‌ ఏదైనా ఓకే చేయడం. 

వెంటనే తెలుసుకోవాలంటే...
ఆండ్రాయిడ్‌ వినియోగదారులు అయితే.. సెట్టింగ్స్‌–యాప్స్, నోటిఫికేషన్లు (ఏదైనా తెలియని యాప్‌లో స్పై, మానిటర్, ట్రాక్‌ ట్రోజన్‌ .. మొదలైన పేర్లు ఉన్నాయేమో చెక్‌ చేయండి. ఒకవేళ అలాంటివి కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి. ఇది తెలుసుకోవడానికి సెట్టింగ్స్, ప్లేస్‌ – గూగుల్‌ ప్లే, ప్రొటెక్షన్‌ స్కాన్‌ చేయండి. 
ఐవోఎస్‌ వినియోగదారులు అయితే..  అన్ని పాస్‌వర్డ్‌లను మార్చాలి. నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌ను రీసెట్‌ చేయాలి. ఐఓఎస్‌ రీసెంట్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేయాలి. 

స్మార్ట్‌ఫోన్లో స్నూపింగ్‌కి అనుమతించేవి... 
పిల్లలు వాడుతున్న స్మార్ట్‌ ఫోన్ల ద్వారా వారు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకోవడానికి ట్రాక్‌ చేయగల యాప్స్‌ ఉంటాయి.
కంపెనీ గ్యాడ్జెట్‌లలో ఇన్‌స్టాల్‌ చేయబడిన మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్, వాటిని కంపెనీ ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి కాబట్టి ఈ హక్కును రిజర్వ్‌ చేసుకోవచ్చు. 
ఆర్డర్‌ డెలివరీని ట్రాక్‌ చేయడం, డెలివరీని పర్యవేక్షించడానికి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుండి నిఘా అవసరం కావచ్చు. 

కొన్ని రకాల సమస్యలు
హాని కలిగించే యాప్స్, స్పై వేర్, పబ్లిక్‌ వైఫై, ఉపయోగించని యాప్స్, ఫిషింగ్, పాస్‌వర్డ్‌ సెక్యూరిటీ లేనివి .. వంటి వాటి వల్ల సమస్యలు కలగవచ్చు. 

ముఖ్యమైన పోర్టల్స్‌ 
మీ ఫోన్‌ IMEI నెంబర్‌ని https://www.imei.info/   చెక్‌ చేయండి. 
 మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నెంబర్లు ఉన్నాయో చెక్‌ చేసుకోవడానికి https://tafcop.dgtelecom.gov.in

సైబర్‌ టాక్‌
ఎలా చెక్‌ చేయాలి? 
ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అయితే సెట్టింగ్స్‌–యాప్స్, నోటిఫికేషన్స్‌– కెమెరా/ మైక్రోఫోన్‌  (ఏదైనా తెలియని యాప్‌కి యాక్సెస్‌ ఉందో లేదో తనిఖీ చేయండి)  
 యాపిల్‌ ఫోన్‌ అయితే సెట్టింగ్స్‌– ప్రైవసీ–కెమెరా/మైక్రోఫోన్‌ (ఏదైనా తెలియని యాప్‌కి యాక్సెస్‌ ఉందో లేదో చెక్‌ చేయాలి) 

తెలుసుకోవడం ఎలా..?
 ఫోన్‌ చాలా స్లో అవుతుంది. ఫోన్‌ త్వరగా వేడెక్కుతుంది.
 డేటా వినియోగం బాగా పెరుగుతుంది.
యూ ట్యూబ్‌ లేదా ఆన్‌లైన్‌ వీడియోలు బఫర్‌ అవ్వవు.
వెబ్‌ పేజీలు లోడ్‌ అవడానికి టైమ్‌ పడుతుంది.
♦ ప్రోగ్రామ్స్, యాప్స్‌ క్రాష్‌ అవుతాయి.
♦ గాడ్జెట్‌ సడెన్‌గా రీస్టార్ట్‌ అవుతుంది.
♦ చిత్రమైన, ఊహించని మెసేజీలు వస్తుంటాయి. 

ఏం  చేయాలి? 
మీ ఫోన్‌ పరిమితులను మీకు మీరుగా నిర్దేశించుకోండి. 
ఐఓఎస్‌ యాప్స్‌ని వెంటనే అప్‌డేట్‌ చేయండి. 
ఉపయోగంలో లేనప్పుడు మీ గ్యాడ్జెట్స్‌ను లాక్‌ చేసి ఉంచండి. 
వైఫై, బ్లూ టూత్‌ వాడకంలో జాగ్రత్తలు పాటించండి. 
బ్యాంకింగ్, సామాజిక మాధ్యమాల కోసం రెండురకాలప్రామాణీకరణలను పాటించండి. 
డేటాను తరచూ బ్యాకప్‌ చేయండి. 
సెక్యూరిటీ యాంటీవైరస్, మాల్వేర్‌ అప్లికేషన్లను ఉపయోగించండి
మీరు ఇన్‌స్టాల్‌ చేసే యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే ఎంచుకోండి.

- ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల,  డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్,  ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top