పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..! | Parabhava Nama Samvatsara Ugadi 2026: Significance | Sakshi
Sakshi News home page

పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!

Mar 17 2026 11:57 AM | Updated on Mar 17 2026 4:08 PM

Parabhava Nama Samvatsara Ugadi 2026: Significance

తెలుగు వారి నూతన సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం మార్చి 19, 2026న ప్రారంభం కాబోతుంది. అయితే చాలా మంది సంవత్సరం పేరు చూసి భయపడుతున్నారు. ఇదే సంవత్సరంరా బాబు..అసలు బాగుంటుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పేరే పరాభవ నామ సంవత్సరం అంటే అన్ని పరాభవాలే, అవమానాలేనా అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ పరాభవ నామ సంవత్సరం అంతరార్థం ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.

మనిషిలో ఉన్న 'అహంకారం', 'గర్వం', 'స్వార్థం' పరాభవం పాలు కావడాన్ని (ఓడిపోవడాన్ని) ఇది సూచిస్తుంది. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను  జయించి, వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. అహంకారంతో విర్రవీగే పాలకులకు, వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. కానీ... వినయంతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుంది. 

జ్యోతిష్య శాస్త్రంలో పరాభవ నామ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ఉగాది పచ్చడి కూడా విలక్షణమైనదిగానే పరిగణిస్తారట. ఎందుకంటే.. ఆరు రుచుల తోపాటు ప్రతికూలత అనుకూలత అనే రెండింటిని సమానంగా చూపుతుంది. ఎవరు అయితే సవాళ్లను అధిగమించి, సహనంతో ముదుకు సాగుతారో వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుందంట. 

అలాగే సంవత్సరం ఫలితాలు అనేవి కేవం కొత్త ఏడాది పేర్లపైనే ఆధారపడి ఉండవు, ఇవన్నీ కూడా కర్మ, ప్రయత్నం, ధర్మం, భక్తి ఆధారంగా మారతాయి. కానీ ఈ పేర్లు కేవలం మీకు ఒక సూచను ఇస్తాయని వారు తెలుపుతున్నారు.

(చదవండి: చైత్రమాసం విశిష్టత..! తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..)

 

Advertisement
 
Advertisement
Advertisement