నోరూరించే నర్గీస్‌ కోఫ్తా.. తయారీ ఇలా!

Non Vegetarian Nargisi Kofta, Chicken Xacuti Recipes Easy Made Tips - Sakshi

కావలసినవి: గుడ్లు – ఎనిమిది; మటన్‌  ఖీమా – అరకేజీ; ఉల్లిపాయ – ఒకటి(ముక్కలు తరగాలి; వెల్లుల్లి తరుగు – టేబుల్‌ స్పూను; పసుపు – టీస్పూను; కారం – అరటీస్పూను; గరంమసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; బియ్యప్పిండి – అరకప్పు; ఆయిల్‌ – డీప్‌ఫ్రైకి సరిపడా.

గ్రేవీ కోసం: ఆయిల్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు ; ఉల్లిపాయలు – రెండు (ముక్కలు తరగాలి); వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు; అల్లంపేస్టు – రెండు టీస్పూన్లు; టొమాటోలు – మూడు(పేస్టు చేసుకోవాలి); ధనియాలపొడి  – రెండు టీస్పూన్లు; జీలకర్ర – టీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – అర టీస్పూను; గరం మసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పెరుగు – ఎనిమిది టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా.

తయారీ: 
► ముందుగా ఆరు గుడ్లను ఉడికించి, పెంకు ఒలిచి పక్కన పెట్టుకోవాలి.

► పెద్ద గిన్నెలో మటన్‌  ఖీమా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక గుడ్డుసొన వేసి పేస్టులా కలపుకోవాలి 

► ఈ మిశ్రమాన్ని ఆరు సమభాగాలుగాచేసి పక్కనపెట్టుకోవాలి

► ఉడికించిన ఒక్కో గుడ్డుకు పూర్తిగా కవర్‌ అయ్యేలా ఖీమా మిశ్రమాన్ని పట్టించాలి 

► అన్ని గుడ్లకు పట్టించాక బియ్యంపిండిలో ముంచాలి మిగిలిన గుడ్డుసొనను బాగా కలపాలి. బియ్యప్పిండిలో ముంచిన గుడ్లను ఈ గుడ్డుసొనలో ముంచి గోల్డెన్‌ బ్రౌన్‌  కలర్‌లోకి మారేంత వరకు డీప్‌ఫ్రైచేసి పక్కనపెట్టుకోవాలి 

► వేడెక్కిన బాణలిలో గ్రేవీకోసం తీసుకున్న ఆయిల్‌ వేయాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలువేసి రంగు మారేంత వరకు వేయించాలి 

► ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులను వేసి మూడు నిమిషాలు వేయించి టొమాటో పేస్టు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేయాలి

► రుచికిసరిపడా ఉప్పు వేసి ఆయిల్‌ పైకి తేలేంత వరకు ఉడికించాలి. 

► ఇప్పుడు పెరుగు, అరకప్పు నీళ్లు వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి, డీప్‌ఫ్రై చేసి పెట్టుకున్న కోప్తాలను వేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి ∙ఐదునిమిషాలు మగ్గాక కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే నర్గీస్‌ కోఫ్తా రెడీ. ఇది రైస్,చపాతీల్లోకి మంచి సైడ్‌ డిష్‌. (క్లిక్‌హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి)

చికెన్‌ కాగ్జీకట్‌

కావలసినవి: చికెన్‌  – అరకేజీ; చిన్న ఉల్లిపాయలు – ఎనిమిది; బంగాళ దుంపలు – ఎనిమిది; వెల్లుల్లి రెబ్బలు – ఆరు; అల్లం – అంగుళం ముక్క ; పెద్ద ఉల్లిపాయ – ఒకటి; పచ్చికొబ్బరి తురుము – కప్పు; ఎండుమిర్చి – ఏడు; లవంగాలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; మిరియాలు – పది; ధనియాలు – టేబుల్‌ స్పూను; మెంతులు – టీస్పూను; గసగసాలు – టేబుల్‌ స్పూను; సోంపు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; జాజికాయ పొడి – టీస్పూను; ఆయిల్‌ – నాలుగు టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా.

తయారీ:  
► ధనియాలు, గసగసాలు, మెంతులను పొడిచేకోవాలి

► అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను సన్నగా తరగాలి

► బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్‌ వేసి ఎండుమిర్చి,  జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు వేసి వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము వేసి  మూడు నిమిషాలు వేయించాలి

► ఇప్పుడు ధనియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గాక,  చికెన్‌  వేసి సన్నని మంట 10 నిమిషాలు ఉడికాక చిన్న ఉల్లిపాయలు, బంగాళ దంపలు వేసి ఉడికించాలి

► ఆయిల్‌ పైకి తేలాక జాజికాయ పొడి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. (క్లిక్‌కీమా ఇడ్లీ, బనానా షీరా చాక్లెట్‌ బాల్స్‌, బ్రెడ్‌–ఎగ్‌ బజ్జీ తయారు చేసేద్దామిలా..)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top