Honey Chicken: హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి

​how to make honey chicken - Sakshi

మనం నిత్యం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ  రకరకాల రుచికరమైన  వంటలను తయారు చేసుకొని అరగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చికెన్ అంటే చాలు లొట్టలేసుకుని లాగించేస్తారు. ఈ రోజుల్లో చిన్న నుంచి పెద్ద  వరకు  చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. అలాంటి వారి కోసమే హనీ చికెన్ తయారీతో మీ ముందుకు వచ్చాము. ఈ చక్కని వెరైటీ రిసిపిని ఊహించుకుంటేనే  నోరూరుతుంది కదా? అయితే వెంటనే మీరు కూడా తయారు చేసుకోవాలిసిందే....

హనీ చికెన్‌
కావాల్సిన పదార్థాలు..
1. కొన్నిబొన్‌లెస్‌ చికెన్ ముక్కలు
2. అవసరాన్ని బట్టి ఉప్పు
3. తేనె  తగినంత
4. వెన్న కావలసినంత
5.తగినంత నిమ్మ రసం
6. సోయా సాస్ తగినంత

ఇప్పుడు తయారీ విధానం...
ముందుగా చికెన్ ను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత స్టౌవ్ మీద ఒక దళసరి పాన్‌ని  పెట్టుకోని నూనె వేసుకోవాలి. నూనె తగినంత వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కలను వేసి 4-5 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.  తర్వాత మీడియం మంట మీద ఇంకో పాన్‌ని తీసుకోండి. దానిలో కొద్దిగా వెన్న, తేనె వేసుకోవాలి. వెన్న అనేది పూర్తిగా కరిగిన తరువాత  మంటను ఆపేయండి. ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నిమ్మ రసం, ఉప్పు తగినంత వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తరువాత ఈ తేనె మిశ్రమం లో ఫ్రై చేసిన చికిన్‌ ముక్కలను వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. అవసరం బట్టి షెజ్వాన్ సాస్ కూడా ఊపయోగించ వచ్చు. ఆ తరువాత స్టౌ మీద నుంచి కూరను దింపేయాలి. అంతే వేడి వేడిగా హనీ చికెన్ రెడీ.

చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్‌ సమోసా, మరమరాల వడ తయారీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top