బేబమ్మ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Nitika Gujrals Branded Saree Worn By Kriti Shetty Is Very Expensive ​ - Sakshi

కృతి శెట్టి.. తెలుగు ప్రేక్షకుల అభిమాన ఉప్పెనలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆచితూచి సినీ అవకాశాలను అందుకుంటున్నట్టే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌నూ ఆచితూచే ఎంచుకుంటూ కంఫర్ట్‌నే తన స్టయిల్‌గా మార్చుకుంది. ఆమె ఫాలో అవుతున్న బ్రాండ్స్‌లో ఓ రెండు ఇక్కడ.. మనల్ని మనలా ఇష్టపడటంలోనే అసలైన అందం ఉంటుంది ‘ఉప్పెన’లో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేం కదా! కొన్నిసార్లు మేకప్, హెయిర్‌ స్టైల్‌ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రాన ప్లాస్టిక్‌ సర్జరీ అంటారా? నిజానికి మనల్ని మనలా ఇష్టపడటంలోనే అసలైన అందం ఉంటుంది!

నితికా గుజ్రాల్‌..
ఎంతోమంది సెలబ్రిటీలకు ఇష్టమైన బ్రాండ్‌. ముంబైకి చెందిన నితికా అతి చిన్న వయసులోనే టాప్‌ మోస్ట్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగింది. అల్లికలు, కుందన్‌ వర్క్స్‌తో అందమైన డిజైన్స్‌ను రూపొందించడంలో ఆమెది ప్రత్యేక ముద్ర. ఈ బ్రాండ్‌కి విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ధర మాత్రం లక్షల్లోనే. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. నితికా గుజ్రాల్‌ డిజైనర్‌ ధర రూ. 58,500/-

అకోయ జ్యూలరీ..
ఇదొక ఆన్‌లైన్‌ జ్యూలరీ స్టోర్‌. ట్రెండ్‌కి తగ్గట్టు ఫ్యాషన్‌ జ్యూలరీని క్రియేట్‌ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ క్రేజే ఈ  బ్రాండ్‌ను సెలబ్రిటీలకూ డిజైన్స్‌ను అందించే స్థాయికి చేర్చింది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసే వీలు ఉంది. ఈ జ్యూలరీ ధర ఆభరణాల డిజైన్‌, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

(చదవండి: ముఖానికి ఫేస్‌ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!)

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top