చిన్నప్పటినుంచీ తిండిపెట్టిన వాడినే చంపేసింది!

Nigerian Zookeeper killed By Lion He Had Raised Since Birth - Sakshi

మగ సింహం దాడిలో జూకీపర్‌ దుర్మరణం 

ఆహారం పెడుతుండగానే దాడి

క్రూర జంతువులు ఎపుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు అనడానికి తాజా ఘటన ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి తిండి పెట్టి, తనకు సంరక్షుడిగా ఉన్న వ్యక్తినే దారుణంగా చంపేసింది మగ సింహం. అది ఏ మూడ్‌లో ఉందో తెలియదు గానీ తనకు తిండిపెడుతున్న జూకీపర్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నైజీరియా, ఒసున్ రాష్ట్రంలోని ఒబాఫెమి అవోలోవో యూనివర్శిటీ జంతుప్రదర్శనశాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒలియావుకి  అందరూ నివాళులర్పించారు. 

బీబీసీ కథనం దాదాపు దశాబ్ద కాలంగా సింహాలకు సంరక్షుడిగా ఉన్నాడు ఒలాబోడే ఒలావుయి (Olabode Olawuyi), విధుల్లో భాగంగా సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా జూకీపర్‌పై దాడి చేసి చంపేసింది సింహం. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  (Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌, ఫోటోలు వైరల్‌)

ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్. తొమ్మిదేళ్ల క్రితంక్యాంపస్‌లో పుట్టిన సింహం సంరక్షణ బాధ్యతల్లో ఉన్నాడు. మరో దురదృష్టకర  ఘటన ఏంటంటే, జూకీపర్‌ని చంపిన సింహాన్ని కూడా జూ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే వెల్లడించారు.  (COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!)

తాళం వేయకపోవడంతోనే ఘోరం
జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి ,ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు స్పందిస్తూ, ఇది దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ దుర్ఘటన ప్రభావం తనమీద ఉండదనితాను చనిపోయే వరకు సింహాలకు ఆహారం అందిస్తూనే  ఉంటానని తెలిపాడు. ( వెడ్డింగ్‌ సీజన్‌: ఇన్‌స్టెంట్‌ గ్లో, ఫ్రెష్‌ లుక్‌ కావాలంటే..!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top