రక్తహీనతను రానివ్వకండి... | Health Tips Remedy For Controlling Anemia | Sakshi
Sakshi News home page

రక్తహీనతను రానివ్వకండి...

Jan 29 2021 7:22 AM | Updated on Jan 29 2021 8:40 AM

Health Tips Remedy For Controlling Anemia - Sakshi

ఒంట్లో విటమిన్లు, సూక్ష్మ పోషకాలు తగ్గడం వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. ఒంట్లో రక్తం తగ్గితే నీరసం ఆవహిస్తుంది. నిస్త్రాణగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్ధి కాదు. పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువ. రక్తహీనత రాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఇప్పటికే రక్తహీనతతో బాధపడుతున్నా, సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే సరి!

► జున్ను నుంచి బీ–12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడిబియ్యం వాడాలి. 

► రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూరతో జ్యూస్‌ చేసుకుని తాగాలి.

► బీట్‌రూట్‌, క్యారట్‌, ఉసిరి కలిపి జ్యూస్‌ చేసుకుని ఉదయాన్నే తాగితే.. ఐరన్‌ పుష్కలంగా వస్తుంది. ఐరన్‌ సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు.

► రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి. 

► గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసుకుని తాగితే మంచిది. 

► మధ్యాహ్నం పూట ప్రతిరోజూ తోటకూర, గోంగూర, పాలకూర ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి. వారంలో ఆరురోజులు ఆకు కూరలు తినాలనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement