
ఇవాళ ఆలుమగల మధ్య ఉన్న ప్రేమ అనే పదం దారుణంగా అపహస్యం పాలవుతోంది. పెళ్లి అనే పదం కూడా భయాందోళనలు కలిగించేలా మారిపోయింది. అంతలా అనుబంధాలు కనుమరుగైపోతున్న ఈరోజుల్లో అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ ఒకటి తారసపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతా కోరుకునేది ఇలాంటి ప్రేమనే కదా అంటున్నారు నెటిజన్లు.
అయినా ప్రేమించడానికి, ప్రేమించబడటానికి కూడా అదృష్టం ఉండాలేమో..!. సంపాదన ఏదో రకంగా ఆర్జించొచ్చు. ఒక మనిషి ప్రేమను పొందడం, నిలబెట్టుకోవడం రెండూ అంత ఈజీ కాదు. పైగా ఈ రోజుల్లో అలాంటి ప్రేమనేది మచ్చకైనా కానరాని పరిస్థితి.
కానీ ఈ వృద్ధ జంట "ప్రేమ అంటే ఎప్పటికీ ప్రేమే" జీవితాంతం అగ్నికంటే స్వచ్ఛంగా ఉంటుంది అని తమ చేతలతో చెప్పారు.జిష్మా ఉన్నికృష్ణన్ అనే సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టింట అందుకు సంబంధించిన వీడియోని షేర్‌చేశారు.
ఆ వీడియోలో ఒక వృద్ధుడు తన భార్య కాలికి పట్టీలు పెట్టుకోవడంలో ఇబ్బందిపడుతుంటే గమనిస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అతను ఆమెకు సహాయం చేసిన తీరు అచ్చం సినిమాలోని హీరో హీరోయిన్లను తలపించేలా ఉంది. అతడు నిజంగా తన భార్యకు సాయం చేసిన తీరు సినిమాలోని సీను మాదిరిగా అత్యంత యాదృచికంగా కనిపించింది.
ఆ అపూర్వ క్షణాన్ని చూసిన సోషల్ మీడియా వినయోగదారురాలు ఉన్నికృష్ణన్‌కి ఒక్కసారిగా రైలులో ప్రయాణిస్తున్నట్లు అనిపించలేదు. జీవితాంత ప్రేమించడం అనే మాటకు అసలైన అర్థాన్ని తెలుసుకున్నట్లు అనిపించిందట.
అందుకే ఆయన వీడియోకి ఓ మధురమైన క్షణంలో జీవితాంతం ప్రేమించడాన్ని చూశాను అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఆ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ వీడియోని చూసి నెటిజన్లు కూడా అంతా అలాంటి ప్రేమనే కదా ఆశించేది అంటూ ఉద్వేగభరితంగా పోస్టులు పెట్టారు.
(చదవండి: అందువల్లే భారత్‌కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?)