జ్వరంతో బాధపడుతున్న నాగదుర్గ, జంపన, దీక్షిత, చంద్రశేఖర్
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కోర్సవారిగూడెంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని ప్రతి ఇంటికీ ఒకరు జ్వరాలబారిన పడి మంచం పట్టారు. ఇటీవల అడపాదడపా వర్షాలు కురుస్తూ వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో జ్వరాలు పట్టి పీడిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. టైఫాయిడ్‌తోపాటు మలేరియా జ్వరాల బారిన కూడా పడినట్లు గ్రామస్తులు తెలిపారు. కొందరు దొరమామిడి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందగా మరికొందరు బయటకు రాలేని పరిస్థితిలో ఇంటి వద్దే ఉన్నట్లు చెబుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వర పీడితులకు వైద్యసేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


