లంకపాకలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేటుకు బుధవారం గ్రామస్తులు తాళాలు వేశారు. పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో కుదించడాన్ని వ్యతిరేకించారు. 8లో u
నేడు రొయ్యల సాగు చేస్తున్నాను. మేత ధర టన్నుకు ఏకంగా రూ.10వేలు పెంచేశారు. ఆన్‌లైన్‌లో 100 కౌంట్ రూ.280 అని చూపిస్తూ, వాస్తవంగా రూ.220కి కొంటున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చే ఈ రంగంపై ప్రభుత్వ తీరు బాగాలేదు. ఉద్యోగాలు లేక ఆక్వాసాగులోకి వస్తున్న యువ రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతం.
– లావేటి వీరశివాజీ, ఆక్వా రైతు,
లోకుమూడిగరువు, మండవల్లి మండలం
వైఎస్ జగన్ పాలనలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆక్వా ఉత్పత్తుల రవాణా ఆగలేదు. రైతులందరికీ మేలు చేసే ఉద్దేశంతో అప్సడా యాక్టును తీసుకొచ్చారు. నేడు రైతుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా రొయ్యల మేతలు ధరలు పెంచేస్తున్నారు. గతంలో ఆర్బీకేల్లో సైతం రొయ్యల మేతలు లభించేవి. నేడు ఆక్వా రైతులు మేతల ధరలను కొనలేక క్రాఫ్ హాలిడే పరిస్థితికి వచ్చారు.
– తోట మహేష్, రొయ్యల రైతు, కై కలూరు


