రైతుల విషయంలో ఉదారతతో వ్యవహారించాల్సింది పోయి ఇష్టారీతిన ఎరువుల ధరలు పెంచడం సరికాదు. పెట్టుబడులు భారీగా పెరిగి కౌలు రైతులు వ్యవసాయం మానేసే పరిస్థితులు ఎదురుకానున్నాయి. కాంప్లెక్సు, పొటాష్ ఎరువుల ధరలను తగ్గించాలి.
– నిమ్మగడ్డ నరసింహ, కౌలు రైతు సంఘం నాయకుడు, గొల్లపల్లి
ఇప్పటికే పంటలకు సరైన మద్దతు ధరలు లేక నష్టపోతున్నాం. ఇప్పుడు ఎరువుల ధరలను పెంచడంతో పెట్టుబడులు మరింత భారమవుతాయి. ప్రభుత్వాలు రైతులకు మేలు చేయాల్సిందిపోయి ఎరువుల ధరలను పెంచి భారాన్ని మోపడం సరికాదు.
– నక్కనబోయిన వెంకేటేశ్వరరావు, రైతు, తూర్పు దిగవల్లి


