చింతలపూడి : చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది బుధవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాఘవాపురం గ్రామానికి చెందిన పర్స నరసింహారావు అనే వ్యక్తి వద్ద నుంచి 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే కామవరపుకోట మండలంలోని పలు మద్యం దుకాణాల్లో ఎకై ్సజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శ్రీసురక్షశ్రీ యాప్ ద్వారానే మద్యం అమ్మకాలు జరపాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్ ఎస్సైలు అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.
పోలవరంలో..
పోలవరం రూరల్: మండలంలోని ఎల్‌ఎన్‌డీ పేట పరిసర ప్రాంతాల్లోని నాటుసారాయి నిందితుల ఇళ్లలో ఎకై ్సజ్, పోలీస్, ఈఎస్‌టీఎఫ్ బృందాలు బుధవారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా నాటుసారాయి తయారీ, విక్రయదారులకు అధికారులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ దాడుల్లో పోలవరం ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కె.వీరబ్రహ్మం, పోలీస్ ఇన్‌స్పెక్టర్ పి.అప్పారావు, ఈఎస్‌టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.సత్యవతి, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ వై.వి.ఎన్.ఎస్.ఫణి కుమార్ పాల్గొన్నారు.


