కూటమి సభ కోసం చిన్నారులు శిక్షణ తీసుకునే స్కేటింగ్ ట్రాక్ ధ్వంసం చేశారు. ‘కూటమి పాలనకు రెండేళ్లు’ పేరుతో మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి భోజనాలు వంట చేయడానికి ప్రాంగణంలో ఉన్న స్కేటింగ్ ట్రాక్‌ను ఉపయోగించారు. స్కేటింగ్ ట్రాక్ మధ్యలో పెద్ద పెద్ద గోతులు తవ్వడం, ట్రాక్‌పై వంట పాత్రలు, నీళ్ల డ్రమ్ములతో అధ్వానంగా తయారు చేశారు. దీంతో స్కేటింగ్ ట్రాక్‌పై ప్రతిరోజూ సుమారు 100 మందికిపైగా శిక్షణ తీసుకునే పిల్లలకు రెండు రోజుల నుంచి శిక్షణ లేదు. వీటిని ఎప్పుడు తీస్తారో.. తవ్విన గోతులు పూడుస్తారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు


