ఏలూరులో ‘ధార్‌ గ్యాంగ్‌’ కదలికలు | - | Sakshi
Sakshi News home page

ఏలూరులో ‘ధార్‌ గ్యాంగ్‌’ కదలికలు

Jun 17 2026 12:40 AM | Updated on Jun 17 2026 12:40 AM

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలో శ్రీధార్‌ గ్యాంగ్‌శ్రీ కదలికలను పోలీస్‌ నిఘా వర్గాలు గుర్తించాయి. అత్యంత ప్రమాదకరమైన మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఈ దోపిడీ ముఠాను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ధార్‌ గ్యాంగ్‌లో ముగ్గురు సభ్యుల ముఠా కదలికలు ఇటీవల ఏలూరు పెద్దరైల్వే స్టేషన్‌లో గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ నిఘా మరింత పెంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తక్షణమే 112కు గానీ, 8332959174 నంబర్‌కు గానీ ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు.

విశాఖపట్నం వయా రాజమండ్రి, ఏలూరు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ధార్‌ జిల్లా మారుమూల ప్రాంతాలకు చెందిన అత్యంత ప్రమాదకరమైన అంతరాష్ట్ర దొంగల ముఠానే ‘ధార్‌ గ్యాంగ్‌’గా పోలీస్‌ వర్గాలు గుర్తించాయి. ఈ దోపిడీ ముఠా మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, తమిళనాడు వంటి పలు రాష్ట్రాల్లోనూ దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ ధార్‌ ముఠా ఈనెల 13న విశాఖపట్నంలోని కంచరపాలెం పరిధిలో సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ధార్‌ గ్యాంగ్‌లోని ముగ్గురు సభ్యులు 15తేదీ సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌, ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్‌ వెనుకవైపు గేటు నుంచి లోనికి వెళ్లినట్లు పోలీస్‌ నిఘాలో గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement