కనుమరుగవుతున్న తాటిచెట్లు | - | Sakshi
Sakshi News home page

కనుమరుగవుతున్న తాటిచెట్లు

Jun 17 2026 12:40 AM | Updated on Jun 17 2026 12:40 AM

కనుమరుగవుతున్న తాటిచెట్లు అటవీ భూముల్లో గ్రావెల్‌ దందా

జిల్లాలో తాటిచెట్లను నరికి ఇటుకల బట్టీల్లో ఇటుకలను కాల్చడానికి వాడుతున్నారు. దీంతో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 8లో u
అటవీ భూముల్లో గ్రావెల్‌ దందా

ఆగిరిపల్లి: మండలంలోని సూరవరం అటవీ భూముల్లో గ్రావెల్‌ అక్రమ దందా సాగుతోంది. పాత సురవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు గ్రావెల్‌ను ఇష్టారాజ్యంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. గత కొన్ని నెలలుగా పాత సురవరం అటవీ భూముల్లో ఉన్న పినుగుల లంక వద్ద ప్రతి రోజు రాత్రి గ్రావెల్‌ తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. జనసేన పార్టీ నాయకుడు తనకు ఉన్న రెండు జేసీబీలతో కొండను అక్రమంగా తవ్సేసి ఆ మట్టిని ట్రాక్టర్లలో రోజుకి సుమారు 40 ట్రిప్పుల్లో తరలిస్తున్నాడు. ఉంగుటూరు, తేలప్రోలు, గన్నవరం ప్రాంతాలకు తరలించి ట్రక్కు మట్టిని రూ.2,500 నుంచి రూ.3 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇప్పటికే కొండను సుమారు 15 అడుగులలోతు వరకు తవ్వేసినా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. రెండు రోజుల క్రితం రాత్రిపూట అటవీ భూముల్లో తవ్వకాలు సాగిస్తుంటే గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో నామమాత్రంగా రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని, అధికార పార్టీ నేతల ఒత్తిడితో రెండు జేసీబీలను వదిలేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement