చింతమనేనిపై చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

చింతమనేనిపై చర్యలేవి?

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

మాడవీధుల స్థలానికి విరాళం

న్యూస్‌రీల్‌

నేడు న్యాయవాదుల బాయ్‌కాట్‌

మాడవీధుల స్థలానికి విరాళం
కాళ్ల: కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ మాడవీధుల స్థలం కోసం కొమ్మూరి వెంకటనరసింహారావు జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు రూ.1,01,116 విరాళంగా అందించారు.

మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2026

ఏలూరు టౌన్‌: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఏలూరులో రెచ్చిపోయారు.. ఫూటుగా మద్యం సేవించి టీడీపీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిపైకి వెళ్ళి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదంతా ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, సీఐలు, ఎస్‌ఐల సమక్షంలోనే జరగటం విశేషం. పోలీసులను ఏంట్రా అంటూ సంబోధించినా.. గుండెలపై చేతులు వేస్తూ గెంటేసినా.. పోలీసులు నోరెత్తలేదు. ఇదిలా ఉండగా న్యాయవాది శ్రీనివాసబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయ సమీపంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించటం విమర్శలకు తావిచ్చింది. దాడి చేసేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే చింతమనేనిని క్షేమంగా ఇంటి వద్ద దించిన పోలీసు అధికారులు... బాధితుడు శ్రీనివాసబాబుకు 151 నోటీస్‌ జారీ చేసి అతని కుమారుడితో సహా స్టేషన్‌లో ఉంచారు.

ఏలూరులో హైడ్రామా

న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు పోలీస్‌స్టేషన్‌లో అక్రమ నిర్బంధంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఏలూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోనే సీతారాం, ప్రధాన కార్యదర్శి నిమ్మల జ్యోతికుమార్‌, ఉపాధ్యక్షుడు ఎన్‌.కృష్ణారావు, మాజీ ప్రధాన కార్యదర్శి కే.సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో న్యాయవాదులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితుడు శ్రీనివాసబాబుకు మద్దతుగా ఏలూరు బార్‌ సభ్యులు చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించగా లోనికి వెళ్ళేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కనీసం సహచర న్యాయవాదిని కలిసేందుకు పోలీసులు అడ్డుచెప్పటంపై ఏలూరు బార్‌ అసోసియేషన్‌ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు వద్దనే నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా.. ఐదుగురు నాయకులను మాత్రం లోనికి వెళ్ళేందుకు అనుమతించారు. న్యాయవాది శ్రీనివాసబాబు ఆరోగ్య పరిస్థితిని, పోలీస్‌ అధికారుల తీరును అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు లేకపోగా... బాధితుడిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా కోర్టులో సెర్చ్‌ వారెంట్‌కు పిటిషన్‌

ఏలూరు బార్‌ సభ్యులు ఈడ్పుగంటి శ్రీనివాసబాబును సాయంత్రంలోగా విడిచిపెడతామని చెప్పిన పోలీస్‌ అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే సందేహాల నేపథ్యంలో ఏలూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2వ అదనపు జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది గొట్టుముక్కల రోనాల్డ్‌ రాస్‌, పీపీ నర్సింహమూర్తి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కోనే సీతారాం సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ వేశారు. రౌడీషీట్‌ ఉన్న ఎమ్మెల్యే రాత్రివేళ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అతనిపై ఎలాంటి చర్యలు లేకపోగా.. న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు, అతని కుమారుడిని అక్రమంగా నిర్బంధించారని, సెర్చ్‌ వారెంట్‌ ఇవ్వాలని, అడ్వకేట్‌ కమిషనర్‌ను ఏర్పాటు చేయటంతోపాటు కోర్టు సిబ్బంది సమక్షంలో వారెంట్‌ అమలుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు సెర్చ్‌ వారెంట్‌ జారీ చేయటంతోపాటు అడ్వకేట్‌ కమిషనర్‌గా న్యాయవాది సురేష్‌రెడ్డిని నియమించారు.

మంగళవారం ఏలూరు జిల్లా కోర్టుల్లో విధులను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. చింతమనేని ప్రభాకర్‌ తీరుపై న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్‌ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిని జేసీబీతో కూల్చివేస్తామంటూ.. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర భయాందోళనకు గురిచేయటంపై నిరసన తెలుపుతూ బాయ్‌కాట్‌ చేస్తున్నామని ఏలూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కోనే సీతారామారావు ఒక ప్రకటన విడుదల చేశారు. చింతమనేనిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోగా... బాధితుడిని పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు శ్రీనివాస్‌ నిర్బంధం

దాడికి పాల్పడ్డ చింతమనేనికి రక్షణగా పోలీసులు

ఇదెక్కడి న్యాయం: బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement