జి రాయితీ భూముల సమస్యలపై కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

జి రాయితీ భూముల సమస్యలపై కార్యాచరణ

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

జి రాయితీ భూముల సమస్యలపై కార్యాచరణ

ఏలూరు (టూటౌన్‌): కొల్లేరు 5వ కాంటూర్‌ పరిధిలోని జి రాయితీ, డీ ఫారం భూమిదారులు సమస్యల పరిష్కారానికి పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నాగేశ్వరరావు, జ్యోతి పాల్గొన్నారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జి రాయితీ, డి.ఫారం భూమిదారులు సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్‌, జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్‌ గౌడ, డీఎఫ్‌ఓ త్రిమూర్తులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement