ఇంకెంత మందిని చంపేశాడో..
● ఒంటరి వృద్ధ మహిళలే లక్ష్యం
● ఆభరణాలు లాక్కొని హత్యలు
● పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
● వ్యసనాలకు బానిసై ఘాతుకాలు
కై కలూరు: వరుస హత్యలతో కై కలూరు ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. వ్యసనాలకు బాని సైన ఓ యువకుడు అతడి ఇంటి సమీపంలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఆభరణాలు కాజేయడంతోపాటు వారి ప్రాణాలను తీసేశాడు. హతమా ర్చిన తర్వాత ఏమీ ఎరుగనట్టు ప్రజల్లో కలిసిపోయి అయ్యో పాపం అంటూ ముసలి కన్నీరు కార్చాడు. చివరికి అతడి పాపం పండింది. పట్టపగలు ఓ వృద్ధురాలిని చంపేసి ఆభరణాలు తీసుకెళ్లిన సమయంలో ఓ వ్యక్తి చూడటంతో బండారం బయటపడింది. అలాగే కొద్దిరోజుల క్రితం మరణించిన ఓ వృద్ధురాలినీ ఇతడే చంపేశాడని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కై కలూరు పంచాయతీ 8వ వార్డు పాముల వీధిలో మార్పిన వెంకటలక్ష్మి (50) శనివారం సాయంత్రం విగతజీవిగా పడి ఉంది. చెవులు, ముక్కు నుంచి రక్తం కారి ఉంది. మూడు సవర్ల మంగళసూత్రం, చెవిదిద్దులు, రూ.10 వేలు వెరసి మొత్తం రూ.3.10 లక్షలు విలువైన సొత్తు చోరీ జరిగింది. ఇదే వార్డులో ఈనెల 3న ఒంటరిగా జీవిస్తున్న సోము ఆదిలక్ష్మి (80) శరీరం కుళ్లిన రీతిలో మంచంపై మరణించింది. గుండెపో టుతో మరణించిందని బంధువులు దహన సంస్కా రాలు చేశారు. ఆమె ముక్కు, చెవుల నుంచి కూడా రక్తం కారి ఉంది. మృతురాలి ఒంటిపై బంగారు ది ద్దులు, మూడు తులాల ఆంజనేయస్వామి లాకెట్ మాయమయ్యాయి. ఆమె ఇంట్లో ఎక్కడో పెట్టి ఉంటుందని భావించి బంధువులు వెతికి ఊరుకున్నారు.
కిల్లర్ దొరికాడిలా..
కై కలూరు 8వ వార్డుకు చెందిన తుపాకుల ధ్రువంత్ (24) చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తాపీ పనులు, కేటరింగ్‌కు వెళ్లేవాడు. సంత మార్కెట్ సమీపంలో ఓ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నా డు. అతడికి ఇద్దరు సంతానం. భార్యతో గొడవపడి తండ్రి ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం హత్యచేసిన వెంకటలక్ష్మి కుమారుడికి ఇతడు స్నేహితుడు. వెంకటలక్ష్మి కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పరిచయంతో ఆమె ఇంటికి వెళ్లి హత్య చేసి ఆభరణాలతో ఉడాయించాడు. వీటిని కైకలూరులో విక్రయించి ఏలూరు రోడ్డు తాలింపు హోటల్‌లో మద్యం సేవించినట్టు తెలిసింది. వెంకటలక్ష్మి ఇంటి నుంచి ధ్రువంత్ బయటకు రావడం సమీప వ్యక్తి చూడటంతో అసలు విషయం బయటపడింది. ఇదిలా ఉంటే ఈనెల 3న మరణించిన వృద్ధురాలు ఆదిలక్ష్మిని మరొకరితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల ఎదుట నిందితుడు నేరం అంగీకరించినట్టు సమాచారం. అలాగే ధ్రువంత్ పలు చోరీలకు పాల్పడినట్టు విచారణలో బయటపడింది. కై కలూరు స్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్‌కుమార్, సీఐ ఏవీఎస్ రామకృష్ణ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
కిల్లర్ ధ్రువంత్ చిన్ననాటి నుంచి వ్యసనాలకు బానిస కావడంతో పాటు ఘర్షణలకు పాల్పడేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. పనికి వెళ్లేవాడు కాదు. ఈజీ మనీ కోసం పన్నాగాలు వేసేవాడు. ఈనెల 3న వృద్ధురాలు ఆదిలక్ష్మి హత్యలో అతడితో పాటు కై కలూరు సిటీకేబుల్‌లో పనిచేసిన ఓ వ్యక్తి పాత్ర కూడా ఉందని భావిస్తున్నారు. కై కలూరు ప్రాంతంలో ఇటీవల కాలంలో పలువురు వృద్ధుల మరణాలు సంభవించాయి. ఈ కోణంలో ధ్రు వంత్ పాత్రపై అనుమానాలు బలపడుతోన్నా యి. అతడి సెల్‌ఫోన్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.


