పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టాలి

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టాలి రాట్నాలమ్మకు ముడుపులు నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ పోలీస్‌ కుటుంబానికి అండగా.. ఓపెన్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఆహ్వానం

ఏలూరు (టూటౌన్‌): పారిశ్రామిక రంగాల్లో ప్ర మాదాలను అరికట్టాలని, భద్రతా తనిఖీల విధానాన్ని కఠినంగా కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎఫ్‌టీయు (ఇఫ్టూ) జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం ఏలూరులో నిర్వహించారు. ఉమ్మడి జి ల్లా అధ్యక్షుడు కేవీ రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఔ ట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదాలను అరికట్టేలా పరిశ్రమల్లో రెగ్యులర్‌ సేఫ్టీ చెకప్‌ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, భద్రతా నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అందించాలని కోరారు. ఇఫ్టూ జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ బి.సో మయ్య, ఎర్ర శ్రీనివాసరావు, ఈమని గ్రేష్మకుమార్‌, దానవరప్రసాద్‌, ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఉన్న చెట్టుకు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఐశ్వర్యం కోసం ము డుపులు కట్టారు. అమ్మవారిని దర్శించి పూ జలు చేయించారు. ఆలయానికి పలు రూ పాల్లో రూ. 98,707 ఆదాయం వచ్చినట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు, ఈఓ ఎం.సతీష్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విడుదల సత్యనారాయణ తెలిపారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం సో మవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజ లు ఆన్‌లైన్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని, టోల్‌ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా ఏఆర్‌ హెచ్‌సీగా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ మృతిచెందిన ఎ. భాస్కరరావు కుటుంబానికి పోలీస్‌ శాఖ అండగా నిలిచింది. ఏలూరు ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఆదేశాలతో ఏలూరు జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది. డిసీజ్డ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి రూ.లక్ష చెక్కును పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.నాగేశ్వరరావు, నాయకులు ఏఆర్‌ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కమిటీ నేతలు మృతుడు భాస్కరరావు భార్య ఝాన్సీ లక్ష్మీకి అందజేశారు. ఏఆర్‌ ఎస్సై శ్రీనివాసరావు, ఏఆర్‌ హెచ్‌సీ రమేష్‌కుమార్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు, రిటైర్డ్‌ ఆర్‌ఎస్‌ఐ ఎం.సత్యనారాయణ, ఏఆర్‌ ఎస్సై సుగుణరావు, హెచ్‌సీ రామకృష్ణ ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ కోర్సుల్లో ప్రవే శాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. 2026–27 వి ద్యా సంవత్సరంలో 10వ తరగతి ప్రవేశాలకు ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు, ఇంటర్‌లో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులై, ఆగస్టు 31లోపు 15 ఏళ్లు నిండి ఉన్నవారు అర్హులన్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా జూలై 30 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, అదే నెల 31 వరకూ ఫీజులు చెల్లించవచ్చన్నారు. గడువు లోపు ఫీజులు చెల్లించలేని వారు రూ.200 అపరాధ రుసుంతో ఆగస్టు 1 నుంచి 15 లోపు ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement