రక్తదానంపై అవగాహన పెరగాలి | - | Sakshi
Sakshi News home page

రక్తదానంపై అవగాహన పెరగాలి

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాలని, ఆరోగ్యవంతులైన 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని సీఆర్‌ రెడ్డి డిగ్రీ కళాశాల కళ్యాణ చక్రవర్తి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సౌరభ్‌ గౌర్‌ మా ట్లాడుతూ... రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, దానికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. సకాలంలో రక్తం అందడం వల్లే ఎందరో ప్రాణాలు రక్షించబడుతున్నాయని, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కో రారు. సురక్షిత రక్తసరఫరా వ్యవస్థను బలోపేతం చే యడంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ పాత్ర అభినందనీయమన్నారు. రక్తదానంతో పాటు అవయవదానంపై కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ మాట్లాడుతూ.. తలసేమియా బాధితులకు నిరంతరం రక్తాన్ని అందించి, వారి ప్రాణా లు కాపాడటంలో స్వచ్ఛంద రక్తదాతల పాత్ర కీలక మన్నారు. ఏలూరు జిల్లా రెడ్‌క్రాస్‌ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ చైర్మన్‌ వైడీ రామారావు, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడా మాట్లాడుతూ.. రక్తం కొరత లేకుండా రాష్ట్రవ్యాప్తంగా రక్తనిల్వలను పెంపొందించేందుకు అన్ని జిల్లా శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రక్త కేంద్రాలు, అత్యధికంగా శిబిరాలు నిర్వహించిన సంస్థలు, విశిష్ట సేవలు అందించిన దాతలు, విద్యాసంస్థలకు రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు పి.రామచంద్ర రా జు, డి.శ్రీహరిరావు, బీవీఎస్‌ కుమార్‌, ఎంబీఎస్వీ ప్రసాద్‌, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement