హాస్టళ్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

పెనుగొండ: ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణలో మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం పెనుగొండలోని బీసీ బాలికల వసతి గృహా న్ని ఆయన తనిఖీ చేసి విద్యార్థుల హాజరు, వంటశాల, వంట సామగ్రి, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, భవన మరమ్మతులపై ఆరా తీశారు. వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎరువులు అందుబాటులో ఉంచాలి

రైతులకు ఎరువులు ఎప్పటికప్పుడు అందుబాటు లో ఉంచాలని జేసీ ఆదేశించారు. దేవ సొసైటీలో ఆ న్‌లైన్‌ ఆధారిత ఎరువుల విక్రయాలను పరిశీలించా రు. ఆన్‌లైన్‌ అమలులో ఎదురవుతున్న సాంకేతిక స మస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియాను వ్యవసాయేతర అవసరాల విక్రయాల నుంచి నివారించడం, పారదర్శకమైన ఎరువుల విక్రయ వి ధానం కోసం ఆన్‌లైన్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రైతులు కొత్త విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నా రు. ఆర్డీఓ దాసి రాజు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అ ధికారి ఏవీ సూరిబాబు, తహసీల్దార్‌ జి.అనితకుమారి, వ్యవసాయాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, వ్యవసాయ సంచాలకుడు రాఘవేంద్రరావు, దేవ సొసైటీ అధ్యక్షుడు జుత్తిగ ఆంజనేయులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement