భీమవరం అసెంబ్లీ పరిశీలకుడిగా మంతెన | - | Sakshi
Sakshi News home page

భీమవరం అసెంబ్లీ పరిశీలకుడిగా మంతెన

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

భీమవరం అసెంబ్లీ పరిశీలకుడిగా మంతెన

కొయ్యలగూడెం: వైఎస్సార్‌సీపీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా తాను నియమితులైనట్టు మంతెన సోమరాజు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా నియామక పత్రం జారీ చేశారన్నారు. రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా కూడా తనను నియమించారని తెలిపారు. కాగా మంతెన ఇప్పటికే పార్లమెంట్‌ కార్యదర్శిగా, ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement